పవన్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. | Pawan kalyan To Be Team Up With Surender Reddy For New Film | Sakshi
Sakshi News home page

పవన్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. మరో సినిమా

Published Thu, Aug 13 2020 8:15 AM | Last Updated on Thu, Aug 13 2020 8:44 AM

Pawan kalyan To Be Team Up With Surender Reddy For New Film - Sakshi

హైదరాబాద్‌: పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌... ఈ హీరో నుంచి సినిమా అంటేనే అభిమానులు ఎగిరి గంతేస్తారు. అజ్ఞాతవాసి సినిమా తరువాత పవన్‌ ‌సినిమాలు చేయడం ఆపేసి.. రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో ఫ్యాన్స్‌ నిరాశపడ్డారు. ఎన్నికల తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులున్నాయంటూ సినిమాల్లోకి రావడంతో పవన్‌ రీ ఎంట్రీ సిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పవన్‌ దొరికినన్ని సినిమాలను ఓకే చెప్పేస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌ రీమేక్‌ వకీల్‌ సాబ్‌తో పవన​ కల్యాణ్‌ ప్రేక్షకుల మందు రాబోతున్న విషయం తెలిసిందే. (ఆర్జీవీ ట్వీట్‌: పవన్‌ను ఓదార్చిన బాబు)

ఈ చిత్రం షూటింగ్‌ పనులు జరుగుతుండగా లాక్‌డౌన్‌తో బ్రేక్‌ పడింది. లాక్‌డౌన్ లేకపోయుంటే మే 15నే విడుదల కావాల్సింది. ఇదిలా ఉండగా  క్రిష్‌ దర్శకత్వంలో మరో సినిమాకు పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సినిమాలో పవన్‌కి జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ నటించనుంది. తాజాగా పవన్‌ మరో సినిమా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. (పెళ్లి కొడుకు నితిన్‌కు అద్భుతమైన బహుమతి!)

పవన్‌ తన నెక్ట్స్‌ ప్రాజెక్టును దర్శకుడు సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో చేయనున్నారని సమాచారం. ఈ సినిమాను ఎస్‌ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. సెప్టెంబర్‌ 2వ తేదీన పవర్‌ స్టార్‌ పుట్టిన రోజు కావడంతో ఆ రోజు కంటే ముందు సెప్టెంబర్‌ 1న ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. ‘సైరా నర్సింహరెడ్డి’తో హిట్‌ అందుకున్న సురేందర్‌ రెడ్డి ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దనున్నారో వేచి చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement