అన్నయ్య చేయిపట్టి పెరిగాను.. పవన్‌ భావోద్వేగం | Pawan Kalyan Wishes Chiranjeevi On His Birthday | Sakshi
Sakshi News home page

అన్నయ్య చేయిపట్టి పెరిగాను.. పవన్‌ భావోద్వేగం

Published Sat, Aug 22 2020 2:33 PM | Last Updated on Sat, Aug 22 2020 3:54 PM

Pawan Kalyan Wishes Chiranjeevi On His Birthday - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు నేడు (ఆగస్ట్‌ 22). ఈ సందర్భంగా ఆయన సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ భావోద్వేగానికి లోనయ్యారు. తన అన్నయ్య మీద ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. చిరంజీవికి తమ్ముడిగా పుట్టడం తన అదృష్టమని ఆని ఎమోషనల్‌ అయ్యారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అసామన్యుడిగా ఎదిగి, తనలాంటి ఎందరికో స్ఫూర్తి ప్రధాతగా నిలిన వ్యక్తి చిరంజీవి అని​ కొనియాడారు. చిరంజీవి తనకు కేవలం అన్నయ్యే కాకుండా దైవంతో సమానమని వెల్లడిస్తూ జన్మదిన శుభాకాంక్షలు అందించారు.
(చదవండి : చిరు బర్త్‌డే.. ఉపాసన ఎమోషనల్‌ ట్వీట్‌)

అన్నయ్య చేయిపట్టి పెరిగానని, ఆయనే తన తొలిగురువు అని పవన్‌ పేర్కొన్నారు. అంచెలంచెలుగా ఎదిగి కొట్లాది మంది అభిమనులు, శ్రేయోభిలాషుల గుండెల్లో చిరస్మరమైన స్థానాన్ని సంపాదించిన గొప్ప వ్యక్తి చిరంజీవి అని పొగిడారు. ఆయన ఎదుగుదల ఆయనలోని సేవా తత్పరతను ఆవిష్కరింపజేసిందన్నారు. ఆయనలా నటుడవుదామని, ఆయనలా అభినయించాలని కొందరు స్ఫూర్తి పొందితే, ఆయన సేవ చేయాలని మరెందరో ప్రేరణ పొందారని పవన్‌ పేర్కొన్నారు. ఎందరితో స్ఫూర్తిగా నిలిచిన చిరంజీవి జన్మదినం సందర్భంగా తెలుగువారందరూ ఆయనను ఆశీర్వదించాలని పవన్‌ కోరారు. 
(చదవండి : చిరు బర్త్‌డే: ఫ్యాన్స్‌కు మెగా డాటర్‌ స్పెషల్‌ గిఫ్ట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement