Payal Rajput Fire On Indigo Airline Workers Over Her Luggage Damaged - Sakshi
Sakshi News home page

Payal Rajput: పాయల్‌ రాజ్‌పుత్‌కు చేదు అనుభవం, ఆ ఎయిర్‌లైన్‌పై ఫైర్‌..

Published Thu, Sep 15 2022 7:07 PM | Last Updated on Thu, Sep 15 2022 9:14 PM

Payal Rajput Fire On Indigo Airline Workers Over Her Luggage Damaged - Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రైవేటు విమాన‌యాన సంస్థ సిబ్బంది వల్లే తనకు ఇలా జరిగిందంటూ పాయల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేస్తూ.. ఎయిర్‌ పోర్ట్‌ సిబ్బంది తన లగేజ్‌ని డ్యామేజ్‌ చేశారంటూ సోషల్‌ మీడియా వేదికగా ధ్వజమెత్తింది.  ఈ సందర్భంగా తన లగేజ్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఇండిగో విమాన సంస్థ సిబ్బందిపై ఫైర్‌ అయ్యింది. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవ‌ల పాయల్‌ ఇండిగో విమానంలో ప్ర‌యాణించింది. ఈ సంద‌ర్భంగా త‌న ల‌గేజీని ఇండిగో విమాన సిబ్బంది నిర్ల‌క్ష్యంగా విసిరిపారేశార‌ట‌. దీంతో త‌న ల‌గేజ్‌ డ్యామేజ్‌ అయ్యింద‌ంటూ ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్‌ చేసింది ఆమె.

చదవండి: అషురెడ్డి బర్త్‌డే.. కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన ఆమె తండ్రి

‘డ్యామేజ్‌ అయిన నా బ్యాగులు చూడండి. ఇందుకు ఇండిగో విమాన సిబ్బందే కారణం. నా లగేజ్‌ని ఇష్టానుసారంగా విసిరారు. వారి నిర్లక్ష్యం కారణంగా నా లగేజ్‌ దారుణంగా పాడైంది. ఈ ప్రయాణం నాకు ఎన్నడూ ఎదురవని చేదు అనుభవాన్ని ఇచ్చింది’ అంటూ ఇండిగో ఎయిర్‌లైన్‌ను ట్యాగ్‌ చేసింది. అనంతరం కాసేపటికే ఆమె మరో ట్వీట్‌ చేస్తూ ఇండిగో ఎయిర్‌లైన్‌పై ప్రశంసలు కురిపించింది. ఇండిగో సిబ్బంది తన సమస్యను పరిష్కరించిందని చెబుతూ థ్యాంక్స్‌ చెప్పింది. అంతేకాదు తన అభ్యర్థనపై ఇండిగో ఎయిర్‌లైన్‌ స్పందించిన తీరుపై ఆమె హర్షం వ్యక్తి చేసింది. వెంటనే స్పందించి తన సమస్యను పరిష్కరించిన ఇండిగో సేవలకు ధన్యవాదాలు అంటూ పాయల్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే పాయల్‌ ప్రస్తుతం మంచు విష్ణు ‘జిన్నా’ చిత్రంలో నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement