ముంబైలో ఇల్లు కొన్న బుట్టబొమ్మ | Pooja Hegde Buys 3 BHK Apartment in Bandra | Sakshi
Sakshi News home page

ముంబైలో ఇల్లు కొన్న బుట్టబొమ్మ

Published Thu, Feb 18 2021 8:37 PM | Last Updated on Fri, Feb 19 2021 11:22 AM

Pooja Hegde Buys 3 BHK Apartment in Bandra - Sakshi

ముంబై : బుట్టబొమ్మ పూజాహెగ్డే తెలుగు, హిందీ సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తెలుగులో ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్‌ (ఈ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు) అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, హిందీలో సల్మాన్‌ ఖాన్‌ తో ‘కభీ ఈద్‌ కభీ దీవాలి’, రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ చేస్తున్నారు. చేస్తోంది. వీటితోపాటు మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ ఈ బుట్టబొమ్మ తళుకున్న మెరవనున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ నటించనుండగా..ఆయన తనయుడు రామ్‌ చరణ్‌కు జోడీగా పూజా నటించనుంది. ఇలా రెండు భాషల్లో చేతినిండా ప్రాజెక్టులు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ముంబైలోని బాంద్రాలో ఓ ఇల్లును కొనుగోలు చేశారు.

స్కైలైన్ వ్యూ ఉన్న 3బిచ్‌కె అపార్ట్‌మెంట్‌ను ఆమె ఇటీవలె తీసుకున్నట్లు పూజా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఇంటీరియర్‌ డిజైనింగ్‌ను కూడా పూజా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో’ హిట్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అవకాశాలకు తగ్గట్లుగానే పూజా తన తన రెమ్యూనరేషన్‌ను కూడా భారీగా పెంచేసింది. దీంతో వరుస అవకాశాలతో చేతినిండా సంపాదిస్తుంది ఈ భామ. 

చదవండి : (ఆ రెండు లేకుండానే పెళ్లి: ఎందుకో చెప్పిన దియా)

         (రామ్‌చరణ్‌తో జోడీ కట్టనున్న రష్మిక మందన్నా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement