శాంతి ఎపిసోడ్‌.. హాట్‌ టాపిక్‌గా పూనం కౌర్‌ ట్వీట్‌ | Poonam Kaur Comments On AP Endowment Officer Santhi | Sakshi
Sakshi News home page

శాంతి ఎపిసోడ్‌.. హాట్‌ టాపిక్‌గా పూనం కౌర్‌ ట్వీట్‌

Published Mon, Jul 15 2024 6:55 PM | Last Updated on Mon, Jul 15 2024 7:17 PM

Poonam Kaur Comments On AP Endowment Officer Santhi

దిగజారుడు రాజకీయాలకు ఇప్పుడు ఏపీ కేరాఫ్‌ అయ్యింది. వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతను టార్గెట్‌ చేసుకుని ప్రత్యర్థి వర్గాలు నీచమైన చర్యలకు దిగాయి. ఈ క్రమంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ పనిచేస్తున్న కే.శాంతిని బజారుకీడ్చే ప్రయత్నం చేశాయి. అయితే ఆమె ధైర్యంగా మీడియా ముందుకు రావడంతో.. సదరు ఛానెల్స్‌ గుటకలు వేస్తున్నాయి. మరోవైపు.. సదరు మీడియా సంస్థలను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో..

నటి పూనమ్‌ కౌర్‌ చేరారు. బీ బ్రేవ్‌ అంటూ బాధితురాలికి ధైర్యం చెబుతూ ఓ సందేశం ఉంచారు. 'టీవీ ఛానళ్లు బ్లాక్ మెయిలింగ్ సంస్థలుగా మారాయి. ప్రజల కోసం పనిచేస్తున్నామంటూ నేడు తమకంటూ ఒక ఎజెండాను ఏర్పాటు చేసుకున్నాయి. గిరిజనురాలైన శాంతి అనే అధికారిని రక్షించేందుకు ధైర్యంగా ముందుకొచ్చిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గారిని అభినందిస్తున్నాను. మీడియా ముసుగులో ప్రభుత్వ అధికారి శాంతిని కూడా ఇబ్బంది పెట్టేందుకు గతంలో మాదిరి ఒకటే ప్యాటర్న్ వాడారు. ప్రెగ్నెంట్ అని, డబ్బులు తీసుకుందని అంటూ తప్పుడు నిందలు మోపుతున్నారు. 

ఇంతకంటే వాళ్లు చేసేది ఏం ఉండదు. నేటి సమాజంలో టీవీ ఛానెళ్లు బ్లాక్ మెయిల్ చేసే వ్య‌వ‌స్థ‌ల్లా త‌యార‌య్యాయి. నేను ఆ మహిళకు ఒక్కటే చెప్తున్నా. నువ్వు ఏడిస్తే వాళ్లు గెలిచామని అనుకుంటారు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇలాంటి వారి ముందు తల వంచకండి. ఆ ఎద‌వ‌ల కోసం నీ క‌న్నీరును వృథా చేసుకోకండి. నీకు తప్పకుండా న్యాయం జరగుతుంది.

తప్పుడు రాతలు రాసే చెత్త మీడియా నుంచి మిమ్మల్ని, మీ గౌరవానికి రక్షణగా ఒక బలమైన వ్యక్తి అండగా నిలబడ్డారు. ఆ మీడియా కథనాల వెనకున్న కుట్రలను ఆయన తప్పకుండా వెలికితీస్తారు. వారికి తగిన శిక్ష పడేలా ఆయన చేస్తారు. నీ వెంట ఎప్పటికీ మేము ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి. ధైర్యంగా పోరాడండి.' అని పూనమ్‌ తన ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement