అమెరికన్ టెలివిజన్ హోస్ట్, ప్రఖ్యాత నటి రికీ లేక్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తరుచుగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి అనేక స్పూర్తిదాయకమైన పోస్ట్‌లను షేర్ చేస్తుంది. గత సంవత్సరం రికీ లేక్.. త్రోబాక్ వీడియోతో ఆండ్రోజెనిక్ అలోపేసియా (హెయిర్ లాస్)పై తన 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గురించి చెప్పుకొచ్చింది. జుట్టు రాలే సమస్యతో చాలా సంవత్సరాలు రహస్యంగా పోరాడినట్లు తెలిపిన ఆమె తాజాగా స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.
(ఇదీ చదవండి: తంగలాన్ షూటింగ్‌లో గాయాలు.. కోలుకున్న విక్రమ్)
అయితే ఇందులో ఆమె ఒంటిపై దుస్తులు లేకుండా ఫోటో షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆ ఫోటోలో రికీ లేక్ బాత్‌టబ్‌లో కూర్చుని, సూర్యకాంతిలో తడిసి, ప్రశాంతమైన చిరునవ్వుతో మెరుస్తూ, తన చేతులతో శరీర పైభాగాన్ని కప్పివేసింది. 'ఈ రోజులు నా జీవితంలో అత్యుత్తమమైనవి. 54 సంవత్సరాల వయసులో కూడా యవ్వనంగా కనిపిస్తున్నా.. ఆండ్రోజెనిక్ అలోపేసియాను ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఇప్పుడు నా జుట్టు పదిలంగా ఉంది.
ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతమైనదే కాదు ప్రేమ పంచే అభిమానులు ఉన్న దేశం' అంటూ దీనికి క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన జుట్టు రాలడానికి కారణమైన ఆండ్రోజెనిక్ అలోపేసియా అనే వ్యాధితో తన 30 ఏళ్ల పోరాటం గురించి చెబుతూ చేసిన ఈ పోస్ట్‌కు ఆమె అభిమానుల నుంచి అపారమైన స్పందన లభిస్తోంది. రికీ షేర్ చేసిన ఫోటోను ఆమె భర్త రాస్ బర్నింగ్‌హామ్ క్లిక్‌మనిపించారు. గతేడాది జనవరిలో బర్నింగ్‌ను మూడో పెళ్లి చేసుకుంది రికీ లేక్.
( ఇదీ చదవండి: జీవితం చాలా చిన్నది..ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలియదు: అనుపమ)
Comments
Please login to add a commentAdd a comment