Prabhas Becomes South Asian No 1 Celebrity Over 50 Members List - Sakshi
Sakshi News home page

Prabha: ప్రభాస్‌ ఖాతాలో మరో అరుదైన రికార్డు

Published Fri, Dec 10 2021 9:17 AM | Last Updated on Fri, Dec 10 2021 9:35 AM

Prabhas Becomes South Asian No 1 Celebritie Over 50 Members List - Sakshi

‘బాహుబలి’తో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌.. ఆనంతరం అదే స్థాయిలో దూసుకుపోతున్నాడు. పలు పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లకు సంతకం చేసి బడా హీరోగా మారాడు. ఈ క్రమంలో ప్రభాస్‌ తన 25వ చిత్రం సందీప్‌ వంగ డైరెక్షన్‌లో చేయబోతున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనున్న ఈ చిత్రం దేశవ్యాప్తంగా 8 భాషల్లో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో ఈ చిత్రం రూపొందనుంది. దీంతో ప్రభాస్ ఇంటర్నేషనల్‌ హీరోగా కూడా మారనున్నాడు. ఇలా వరసగా విజయాలు, రికార్డులను సొంతం చేసుకున్న ప్రభాస్‌ ఖాతాలో మరో అరుదైన ఘనత వచ్చి చేరింది.

చదవండి: ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోన్న ‘కొండపొలం’, ఎక్కడంటే..

ఇండియన్‌ హీరోలలో మరెవ్వరికీ సాధ్యం కాని అరుదైన రికార్డు ఇది. 2021 ఏడాదికి సంబంధించి నెం. 1 సౌత్‌ ఏషియన్‌ సెలబ్రెటీగా ప్రభాస్‌ నిలిచాడు. యునైటెడ్ కింగ్‌డ‌మ్‌(యూకే) ఈస్టర్న్ ఐ వీక్లి అనే ప్రముఖ వెబ్ సైట్ నిర్వహించిన ఈ సర్వేలో ప్రభాస్ మొదటి స్థానం దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని సదరు వెబ్‌సైట్‌ వెల్లడిస్తూ ఓ కథనం ప్రచురించింది. ఈ జాబితాలో ఆసియా నుంచి మొత్తం 50 మంది సెలబ్రెటీలు పోటీపడగా.. అందరిలో ప్రభాస్‌ అగ్రస్థానంలో నిలిచాడని పేర్కొంది. ప్రస్తుతం ప్రభాస్‌ రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌, సలార్‌తో పాటు కే, స్పిరిట్‌ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. 

చదవండి: ఎట్టకేలకు స్పందించిన విక్ట్రీనా, ఒక్కటయ్యామంటూ అధికారిక ప్రకటన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement