Prabhas Birthday Special: Fans Crazy Tribute To Darling Prabhas - Sakshi
Sakshi News home page

Prabhas Birthday Special: ప్రభాస్‌ కోసం ఆయన ఫ్యాన్స్‌ ఏం చేశారో తెలుసా?

Published Sat, Oct 22 2022 4:53 PM | Last Updated on Sat, Oct 22 2022 6:33 PM

Prabhas Birthday Special: Fans Crazy Tribute To Darling Prabhas - Sakshi

Happy Birthday Prabhas: ప్రభాస్‌.. నాట్స్‌ జస్ట్‌ ఏ నేమ్‌.. ఇట్స్‌ ఏ బ్రాండ్‌ అంటారు డార్లింగ్‌ ఫ్యాన్స్‌. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ ప్రభాస్‌కు అభిమానులున్నారు.బాహుబలి  సినిమాతో ప్యాన్‌ ఇండియా స్టార్‌ అయిన ప్రభాస్‌కు విదేశాల్లోనూ విపరీతమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమాలు సలార్‌, ప్రాజెక్ట్‌ కేల నుంచి అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.మరోవైపు ప్రభాస్ నటించిన క్రేజీ సినిమా  బిల్లా 4కెలో బర్త్‌డే సందర్భంగా రీ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో నేడు(అక్టోబర్‌23)న ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా ఆయన వరల్డ్‌ వైడ్‌ క్రేజీ ఫ్యాన్స్‌పై ఓ లుక్కేద్దాం.  


బాహుబలి సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి పాపులారిటీ వచ్చిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్లాక్‌ బస్టర్‌ రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా ప్రభాస్‌ను పాన్‌ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. ఇక బాహుబలి, భల్లాలదేవ, కట్టప్ప, శివగామి పాత్రలు జనాల మదిలో ఎప్పటికీ నిలిచిపోయేంత క్రేజ్‌ను దక్కించుకున్నాయి. దీన్ని కొన్ని హోటల్స్‌ తమ ప్రమోషన్స్‌కి ఇప్పటికీ వాడుకుంటున్నాయి. ఇందులో భాగంగానే బాహుబలి థాలీ, దేవసేన పరాఠా, కట్టప బిర్యానీ, భల్లదేవ పాటియాలా లస్సీ, శివగామి షాహి పక్వాన్ వంటి స్పెషల్‌ వంటకాలను తమ మెనూలో చేర్చారు. ఇప్పటికీ బాహుబలి థాలీకి మంచి డిమాండ్‌ ఉంది. 

ప్రభాస్‌ మిర్చిలాంటి కుర్రాడు. సరిగ్గా ఇదే పాయింట్‌ను తమ బిజినెస్‌ ప్రమోషన్‌కు వాడేసింది జపాన్‌లోని ఓ హోటల్‌. అక్కడ దొరికే ఓ స్పైసీ డిష్‌ ప్యాకేజింగ్‌లో ప్రభాస్‌ ఫోటోను అతికించి తమ బిజినెస్‌కు ప్రమోట్‌ చేసుకున్నారు. జపాన్‌లో ప్రభాస్‌కు క్రేజీ ఫ్యాన్స్‌ ఉండటంతో దీనికోసం అక్కడి ప్రజలు ఎగబడ్డారు. 

ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఓ ఫ్యాన్‌ ఏకంగా తన వీపుపై బాహుబలి టాటూను వేయించుకున్నారు. ఈ టాటూ ఫోటో అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. 

ఆరడుగుల అందగాడు ప్రభాస్‌కు అమ్మాయిల ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. రష్యన్‌కు చెందిన ఓ లేడీ ఫ్యాన్‌ లవ్‌ ప్రభాస్‌ అంటూ తన వీపుపై టాటూ వేయించుకుంది. మరికొందరు అమ్మాయిలేమో ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటూ ఇప్పటికీ రిక్వెస్టులు పెడుతూనే ఉంటారు.  మరి ఈ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాలి.

ప్రపంచ వ్యాప్తంగా బాహుబలికి పెద్ద వాళ్ల నుంచి చిన్నపిల్లల దాకా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందుకే కొన్ని టాయ్స్‌ కంపెనీలు బాహుబలి బొమ్మలను రూపొందించి బాగా లాభాపడ్డాయి.ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జపాన్‌లో డార్లింగ్‌కు క్రేజీ గర్ల్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఓసారి జపాన్‌ లేడీ ఫ్యాన్స్‌ అంతా కేవలం ప్రభాస్‌ను కలవడానికే ఇండియాకు వచ్చారు. స్వయంగా ఆయన ఇంటి ముందు కూడా కొన్ని ఫోటోలను దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

ప్రస్తుతం ప్రభాస్‌ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో సలార్‌, నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ప్రాజెక్ట్‌ కే చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటితో పాటు సందీప్‌ రెడ్డి వంగా, మారుతి దర్శకత్వంలోనూ ప్రభాస్‌ సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం ఆయన ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement