Pan India Rebel Star Prabhas Birthday Special - Sakshi
Sakshi News home page

Prabhas Birthday wishes: స్వీటీ అనుష్క స్వీట్‌ మెసేజ్‌ చూశారా?

Published Sat, Oct 23 2021 10:22 AM | Last Updated on Sat, Oct 23 2021 3:31 PM

Pan India Rebel Star Prabhas Birthday wishes Special CDP - Sakshi

ప్యాన్‌ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది.  సూపర్ స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న యంగ్ పుట్టిన రోజు సందర్భంగా రాధేశ్యామ్ టీం విషెస్‌ తెలిపింది. ఇంకా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌,  మైత్రీ మూవీ మేకర్స్‌ కూడా డార్లింగ్‌కు విషెస్‌ అందిస్తూ ట్వీట్‌ చేసింది. అలాగే వెంకీమామ ఫ్యాన్స్‌ ప్రభాస్‌ స్పెషల్‌ డీపీ విడుదల చేసింది.
(చదవండి: ‘డార్లింగ్’ పేరు వెనుక ఉన్న సీక్రెట్‌ ఏంటో తెలుసా?)

ముఖ్యంగా టాలీవుడ్‌ హీరోయిన్‌ స్వీటీ అనుష్క కూడా తన రీల్‌ హీరోకి స్పెషల్‌ విషెస్‌ తెలిపింది. అలాగే తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌ పండగ చేసు కుంటున్నారు. దీంతో ప్రత్యేక శుభాకాంక్షలతో సోషల్‌ మీడియా హోరెత్తుతోంది.(Prabhas: క్లాస్‌ అయినా మాస్‌ అయినా.. మోత మోగాల్సిందే!)

కాగా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఏకంగా ఐదు సినిమాలుండటం విశేషం. ముఖ్యంగా రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ వచ్చే ఏడాది  జనవరి 14వ తేదీన థియేటర్లను పలకరించనుంది. అలాగే ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటితోపాటు స్పిరిట్ టైటిల్‌తో అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో మరో మూవీకి సైన్‌ చేశాడు.

Wishing the one and only, the humble giant Prabhas Garu a very Happy Birthday 🎉♥️#HappyBirthdayPrabhas 💥💐 pic.twitter.com/oGbbgrFgIF

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement