
సుమంత్ ప్రభాస్, శరత్, చంద్రు మనోహరన్, అనురాగ్ రెడ్డి
‘‘మహేశ్‌బాబుగారు ‘మేమ్ ఫేమస్’ సినిమా చూసి గొప్పగా మాట్లాడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ మూవీ విడుదల కాకముందే సుమంత్ ప్రభాస్‌తో మరో సినిమా చేయాలని మహేశ్‌గారు ముందుకు రావడం మజా అనిపించింది.. ఆయన ధైర్యానికి హ్యాట్సాఫ్’’ అన్నారు నిర్మాత అనురాగ్ రెడ్డి. సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘మా గురించి మహేశ్ బాబుగారి ట్వీట్ చదువుతున్నపుడు నమ్మలేకపోయాను. నా తర్వాతి సినిమాని అనురాగ్, శరత్‌గార్లతో కలసి మహేశ్‌గారు నిర్మిస్తామని చెప్పడం అద్భుతం అనిపించింది’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రీమియర్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. కొత్తవారితో చేసిన సినిమాకి ఇంత మంచి రెస్పా¯Œ ్స రావడానికి కారణమైన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు శరత్ చంద్ర. ‘‘మహేశ్ బాబుగారి మాటలు గొప్ప స్ఫూర్తిని ఇచ్చాయి’’ అన్నారు చంద్రు మనోహరన్.
Comments
Please login to add a commentAdd a comment