Sumanth Prabhas
-
ఓటీటీలోకి వచ్చేసిన మేమ్ ఫేమస్ సినిమా, ఎక్కడంటే?
షార్ట్ ఫిలింస్‌తో ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం మేమ్ ఫేమస్. ఊర్లో బలాదూర్‌గా తిరిగే ముగ్గురి యువకులు ఎలా ఫేమస్ అయ్యారనేదే కథ. కామెడీ పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. మే 26న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ నెల రోజుల తర్వాత నేటి(జూన్ 30) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో సినిమా చూడటం మిస్ అయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.. మేమ్ ఫేమస్ విషయానికి వస్తే.. 'మేజర్', 'రైటర్ పద్మభూషణ్' తర్వాత చాయ్ బిస్కెట్ అధినేతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర.. లహరి ఫిల్మ్స్ చంద్రు మనోహర్ నిర్మాణ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్యామ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. కథేంటంటే.. బండనర్సంపల్లి గ్రామానికి చెందిన మహేశ్ అలియాస్ ముగ్గురు కుర్రాళ్లు ప్రాణ స్నేహితులు. వీరు ఊర్లో అల్లరిచిల్లరగా తిరుగుతూ అందరితో తిట్లు తిట్టించుకుంటారు. ఈ ముగ్గురికీ చెరో లవ్‌స్టోరీ ఉంది. అయితే గ్రామంలో జరిగిన ఓ సంఘటన వల్ల తాము కూడా పని చేసి శభాష్ అనిపించుకోవాలనుకుంటారు. అందుకోసం ఓ టెంట్‌హౌస్ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత వీళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి? ఫేమస్ యూట్యూబ్ చానల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ చానల్ ద్వారా ఊరికి ఎలాంటి మేలు జరిగింది? ఆవారాగా తిరిగే ఆ ముగ్గురు ఎలా ఫేమస్ అయ్యారు? అనేదే మిగతా కథ. View this post on Instagram A post shared by Lahari Music (@laharimusic) చదవండి: ఇంట్లో జరిగిన పెళ్లికి భార్యాపిల్లలు డుమ్మా.. చేతులు జోడించి క్షమాపణలు కోరిన నటుడు! -
చాలా రోజుల తర్వాత అలాంటి చిత్రాన్ని చూశా: రాజమౌళి ప్రశంసలు
సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి కీలక పాత్రల్లో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 26న విడుదల విడుదల కాగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రంపై దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు. చాలా కాలం తర్వాత పూర్తిస్థాయిలో ఓ వినోదాత్మక చిత్రాన్ని చూశానంటూ ప్రశంసించారు. (ఇది చదవండి: విజయ్ దేవరకొండ స్టైల్లో 'మేమ్ ఫేమస్' రిలీజ్ డేట్) రాజమౌళి ట్వీట్ రాస్తూ..'చాలా కాలం తర్వాత థియేటర్లో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రాన్ని చూశా. దర్శకుడు, నటుడు సుమంత్ కు మంచి భవిష్యత్ ఉంది. మేమ్ ఫేమస్‌లో నటించిన వారంతా ఎంతో సహజంగా నటించారు. ముఖ్యంగా అంజిమామ అదరగొట్టేశాడు. ఈ మూవీ చూడాల్సిందిగా ప్రతి ఒక్కరికీ రెకమెండ్ చేస్తున్నా. యూత్‌ను ఎంకరేజ్ చేయాలి.. దమ్ దమ్ చేయొద్దు' అని పోస్ట్ చేశారు. (ఇది చదవండి: Mem Famous Review: ‘మేమ్ ఫేమస్’ మూవీ రివ్యూ) After a long time thoroughly enjoyed a film in the theatre. Watch out for this guy Sumanth. He has a bright future both as an actor and director. All the characters were nicely etched and actors performed naturally. Especially Anji mama. Highly recommend it to everyone. Youth… — rajamouli ss (@ssrajamouli) May 29, 2023 -
డైరెక్టరుగా సైన్ చేసి హీరోగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే...
-
Mem Famous Review: ‘మేమ్ ఫేమస్’ మూవీ రివ్యూ
టైటిల్: మేమ్ ఫేమస్ నటీనటులు: సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, అంజి మామ, మురళీధర్ గౌడ్ తదితరులు నిర్మాణ సంస్థలు: లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ రచన- దర్శకత్వం: సుమంత్ ప్రభాస్ సంగీతం: కళ్యాణ్ నాయక్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ ఎడిటర్: సృజన అడుసుమిల్లి విడుదల తేది: మే 26, 2023 ‘మేమ్ ఫేమస్ కథేంటంటే.. బండ నర్సంపల్లి గ్రామానికి చెందిన మహేశ్ అలియాస్ మయి(సుమంత్ ప్రభాస్), బాలి(మౌర్య), దుర్గ(మణి ఏగుర్ల) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఊరంతా బలాదూరుగా తిరుగుతూ ఊరి జనాలతో ‘తూ’ అనిపించుకుంటారు. ఆ ఊరి సర్పంచ్ వేణు(కిరణ్ మచ్చా), ట్రాక్టర్ డ్రైవర్ అంజిమామ(అంజి మామ మిల్కూరి) మాత్రం ఈ ముగ్గురికి మద్దతుగా ఉంటారు. ఇక మయి తన మేనమామ(మురళీధర్ గౌడ్) కూతురు మౌనిక(సిరి)ని ప్రేమిస్తాడు. అలాగే చిన్నప్పటి స్నేహితులు బబ్బీ(సిరి), బాలీలు కూడా ప్రేమలో ఉంటారు. ఊర్లో జరిగిన ఓ సంఘటన వల్ల తాము కూడా పని చేసి అందరితో శభాష్ అనిపించుకోవాలనుకుంటారు. దాని కోసం ఓ టెంట్ హౌస్‌ని ఏర్పాటు చేయాలనుకుంటారు. సర్పంచ్ వేణు సపోర్ట్‌తో టెంట్‌హౌస్ ఏర్పాటు చేసి దానికి ‘ఫేమస్ టెంట్ హౌస్’ అని పేరు పెడతారు. ఆ తర్వాత వీళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి? మరదలు మౌనికతో మయి ప్రేమాయణం ఎలా సాగింది? ఫేమస్ యూట్యూబ్ చానల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ చానల్ ద్వారా ఊరికి ఎలాంటి మేలు జరిగింది? ఆవారాగా తిరిగే ఆ ముగ్గురు ఎలా ఫేమస్ అయ్యారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. తెలంగాణలోని ఓ పల్లెటూరిలో ఆవారాగా తిరిగే ముగ్గురు యువకుల కథే ‘మేమ్ ఫేమస్’ సినిమా. కామెడీ, ఎమోషనల్, సందేశం.. ఇవన్నీ తన కథలో ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు సుమంత్ ప్రభాస్. యువతను నిరుత్సాహపరచకుండా వారిలోని టాలెంట్‌ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారనే సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాడు. సినిమాలో ఎక్కడా నాటకీయతా సన్నివేశాలు కనిపించావు. రియలిస్టిక్ అప్రోచ్ లో కథా, కథనాలు సాగుతాయి. సినిమాలోని ప్రతి పాత్ర మన ఊర్లో చూసే వ్యక్తులను పోలి ఉంటాయి. డైలాగ్స్ కూడా చాలా సహజంగా ఉన్నాయి. అయితే కథలో కొత్తదనం మాత్రం లేదనే చెప్పాలి. పనీపాట లేకుండా తిరిగే ముగ్గురు స్నేహితులు చేసే చిల్లర పనులు.. దానివల్ల పుట్టే కామెడీ సన్నివేశాలను చూస్తే కొన్ని పాత సినిమాలు కచ్చితంగా గుర్తుకు వస్తాయి. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలకు గ్రామీణ యువకులు కనెక్ట్ అవుతారు. క్రికెట్ గొడవలు.. దావత్ కోసం కోళ్లను కొట్టేయడం.. ఇంజన్‌తో సహా అన్ని పాడైన బైక్‌ని వేసుకొని ఊరంతా తిరగడం లాంటి సీన్స్ నవ్వులు పూయిస్తాయి. అదే సమయంలో కొన్ని సన్నివేశాలను కావాలనే ఇరికించినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. సెకండాఫ్ ఎక్కువగా యూట్యూబ్ చానల్ చుట్టే సాగుతుంది. యూట్యూబ్ వ్యూస్ కోసం పడే కష్టాలు కొన్ని చోట్ల నవ్విస్తే.. మరికొన్ని చోట్ల బోర్ కొట్టిస్తాయి. లిపిస్టిక్ ఎపిసోడ్ అయితే అందరిని ఆకట్టుకుంటుంది. మౌనిక బర్త్‌డేకి సంబంధించిన సీన్, గోరేటి వెంకన్న పాట సినిమాకు ప్లస్ అయ్యాయి. లాజిక్స్ వెతక్కుండా ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్లే వాళ్లకు ‘మేమ్ ఫేమస్’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. సినిమాలో ఒకరిద్దరు మినహా మిగతావారంతా కొత్త వాళ్లే. ఆ విషయం తెరపై ఎక్కడా కనిపించదు. అంత చక్కగా నటించారు. ఇక ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు హీరోగా నటించిన సుమంత్ ప్రభాస్ టాలెంట్‌ని అభినందించాల్సిందే. దర్శకత్వానికే కాదు నటుడిగా కూడా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక హీరో స్నేహితులుగా దుర్గ, బాలీగా నటించిన మౌర్య, మణిలు కూడా చాలా సహజంగా నటించారు. మరదలు మౌనికగా సార్య లక్ష్మణ్, సిటీ నుంచి అమ్మమ్మ వాళ్ల ఇంటికొచ్చిన యువతి బబ్బీగా సిరా రాశి తమ పాత్రలకు న్యాయం చేశారు. అంజిమామ, మురళీధర్‌గౌడ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కల్యాణ్ నాయక్ అందించిన సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగా వస్తాయే తప్ప ఎక్కడా ఇరికించినట్లు అనిపించవు. నేపథ్య సంగీతం కూడా బాగుంది. గోరేటి వెంకన్న ‘గల్లీ చిన్నది’పాట స్పెషల్ అట్రాక్షన్. శ్యామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను చక్కగా తెరపై చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. చాయ్ బిస్కెట్,లహిరి ఫిలింస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంతంగా ఉన్నాయి. -
మహేశ్ మాటలు సంతోషాన్నిచ్చాయి
‘‘మహేశ్‌బాబుగారు ‘మేమ్ ఫేమస్’ సినిమా చూసి గొప్పగా మాట్లాడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ మూవీ విడుదల కాకముందే సుమంత్ ప్రభాస్‌తో మరో సినిమా చేయాలని మహేశ్‌గారు ముందుకు రావడం మజా అనిపించింది.. ఆయన ధైర్యానికి హ్యాట్సాఫ్’’ అన్నారు నిర్మాత అనురాగ్ రెడ్డి. సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘మా గురించి మహేశ్ బాబుగారి ట్వీట్ చదువుతున్నపుడు నమ్మలేకపోయాను. నా తర్వాతి సినిమాని అనురాగ్, శరత్గార్లతో కలసి మహేశ్‌గారు నిర్మిస్తామని చెప్పడం అద్భుతం అనిపించింది’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రీమియర్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. కొత్తవారితో చేసిన సినిమాకి ఇంత మంచి రెస్పా¯Œ ్స రావడానికి కారణమైన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు శరత్ చంద్ర. ‘‘మహేశ్ బాబుగారి మాటలు గొప్ప స్ఫూర్తిని ఇచ్చాయి’’ అన్నారు చంద్రు మనోహరన్. -
కొత్తవాళ్లు ఇంతమంచి చిత్రాన్ని తీశారంటే నమ్మలేకపోతున్నా: మహేశ్‌బాబు
సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఇప్పటికే వినూత్నమైన ప్రచారంతో ఈ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయింది. టాలీవుడ్ యంగ్ హీరోలందరూ ఈ సినిమా ప్రచారంలో పాలుపంచుకున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించింది చిత్రబృందం. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ మహేశ్‌బాబు ట్వీట్ చేశాడు. (చదవండి: ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!) ‘మేమ్ ఫేమస్ చిత్రం అద్భుతంగా ఉంది. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు వాళ్ల పాత్రకు న్యాయం చేశారు. ముఖ్యంగా సుమంత్ ప్రభాస్ తన మల్టీ టాలెంట్‌తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. విజువల్స్, మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ఈ మంచి చిత్రాన్ని తెరకెక్కించిన వారంతా కొత్తవాళ్లు అంటే నమ్మలేకపోతున్నాను’ అని మహేశ్ ట్వీట్ చేశాడు. తమ సినిమాను మహేశ్‌బాబు ప్రశంసించడం పట్ల మేమ్ ఫేమస్ టీమ్ సంతోషం వ్యక్తం చేసింది. చిత్ర నిర్మాతలు మహేశ్‌బాబుకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. అంతేకాదు ‘థ్యాంక్యూ మహేశ్‌బాబు అంటూ ఆ ట్వీట్‌ని పోస్టర్‌పై వేసి ప్రచారం చేసుకుంటుంది. మొత్తంగా మహేశ్ ట్వీట్‌తో ‘మేమ్ ఫేమస్’ చిత్రంపై మరింత అంచనాలు పెరిగాయి. Just watched #MemFamous! Brilliant film!! ❤️❤️ Blown away by the performances of each and every actor in the film, especially writer, director and actor @SumanthPrabha_s - what a talent! The visuals, background score and all the crafts sit perfectly. Can’t believe a bunch of… — Mahesh Babu (@urstrulyMahesh) May 25, 2023 -
అందుకే సుమంత్ ప్రభాస్ అని పేరు పెట్టుకున్నా : ‘మేమ్ ఫేమస్’ హీరో
‘‘తప్పు, ఒప్పు.. ఇలా ఏం చేసినా ఊర్లో ఫోకస్, ఫేమస్ కావాలనే ఆలోచన ఉన్న యువకుల కథే ‘మేమ్ ఫేమస్’. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది’’ అని సుమంత్ ప్రభాస్ అన్నారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. (చదవండి: నేను బయటికి వచ్చానంటే కారణం నరేశ్: పవిత్రా లోకేష్ ) ఈ సందర్భంగా సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘నా పేరు సుమంత్ రెడ్డి. ప్రభాస్‌గారికి ఫ్యాన్‌ని. అందుకే సుమంత్ ప్రభాస్ అని పెట్టుకున్నాను. డిగ్రీ పాసయ్యాక ఎస్ఐ ఉద్యోగానికి ప్రిపేర్ కావాలనుకున్నాను. డిగ్రీ చదువుతున్నప్పుడు కాలేజీలో అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఒక షార్ట్ ఫిల్మ్ తీశాం.. అది నచ్చడంతో ఒక ఫిల్మ్ స్కూల్ వాళ్లు మాకు కంటెంట్ క్రియేట్ చేయమని కెమెరాలు స్పాన్సర్ చేయడంతో ‘పిల్ల పిల్లగాడు’ అనే వెబ్ సిరీస్ చేశాం. అది నచ్చడంతో అనురాగ్, శరత్ అన్న పిలిచి, వెబ్ సిరీస్ చేద్దామన్నారు. నేను సినిమా చేద్దామన్నాను. కథ రెడీ చేయమన్నారు. ఆ తర్వాత ‘మేమ్ ఫేమస్’ కథని వారికి చెప్పాను.. నచ్చడంతో నన్నే డైరెక్షన్ చేయమన్నారు. లీడ్ రోల్‌కి తగ్గ యువకుడు కుదరకపోవడంతో నేనే నటించాను. నా తర్వాతి సినిమా కూడా చాయ్ బిస్కెట్ బ్యానర్లోనే ఉంటుంది’’ అన్నారు. -
‘మేమ్ ఫేమస్’పై సెన్సార్ ప్రశంసలు!
కొన్ని సినిమాలు విడుదలకు ముందే పాజిటివ్ బజ్‌ని క్రియేట్ చేసుకుంటాయి. అలాంటి వాటిలో ‘మేమ్ ఫేమస్’ చిత్రం ఒకటి. సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. శరత్, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహరన్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదల కాబోతుంది. చిన్న సినిమానే అయినా.. వినూత్నమైన ప్రచారంతో భారీ హైప్‌ని క్రియేట్ చేసుకుంది. (చదవండి: బ్రహ్మానందం ఇంట పెళ్లిసందడి.. ఘనంగా కొడుకు నిశ్చితార్థం) తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ని పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేస్తూ ప్రశంసలు కురిపించారు. సినిమా బాగుందని కితాబు ఇచ్చారు. ‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి. ఎమోషనల్ సీన్స్ అందరిని ఆకట్టుకుంటాయి. ప్రతి ఒక్కరికి ఈ చిత్రం నచ్చుతుంది’అని చిత్ర యూనిట్ పేర్కొంది.