![mem famous actor sumanth prabhas upcoming movie update](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/sumanth-prabhas.jpg.webp?itok=klQToCmF)
తొలి చిత్రం ‘మేం ఫేమస్’(mem famous) తో నటుడిగా– దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్(sumanth prabhas) హీరోగా ద్వితీయ చిత్రం తెరకెక్కుతోంది. సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నిధి ప్రదీప్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, సుదర్శన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రెడ్ పప్పెట్ ప్రోడక్షన్స్‌పై రూపొందుతోన్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది.
రేలంగి, భీమవరం, సకినేటిపల్లి లంక వంటి లొకేషన్స్‌తో పాటు అంతర్వేది ఆలయ ప్రాంగణంలో రెండో షెడ్యూల్ పూర్తి చేశాం. ఈ షెడ్యూల్‌లో హై ఎనర్జీ ఆటో రేస్ సీక్వెన్స్, ఇంటెన్స్ యాక్షన్ సీన్ చిత్రీకరించాం. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తాయి. ఈ నెలాఖరులో ప్రారంభించే మూడో షెడ్యూల్‌లో పాటలు, ఇతర కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: సాయి సంతోష్, సంగీతం: నాగ వంశీకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: మధులిక సంచన లంక.
Comments
Please login to add a commentAdd a comment