సోషల్ మీడియా వేదికగా ప్రతిభావంతులైన అమ్మాయిలు ఎంతోమంది పాపులర్ అవుతున్నారు. ఆ పాపులారిటీతో సినీ అవకాశాలనూ అందుకుని రంగుల ప్రపంచంలోనూ రాణిస్తున్నారు. ఆ జాబితాలో సార్య కూడా చేరుతుంది. సార్య స్వస్థలం గుంటూరులోని పల్నాడు. కానీ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఢిల్లీ యూనివర్సిటిలో డిగ్రీ చేసింది.
► కరోనా కాలంలో చాలామందిలాగే.. ఖాళీగా కూర్చోవటం ఇష్టం లేక కాలక్షేపం కోసం సోషల్ మీడియాలో హనీ సార్యగా రీల్స్ చేసేది. ఆ వీడియోలే ఆమెకు యూట్యూబ్ కవర్ సాంగ్స్‌లో నటించే అవకాశాలను తెచ్చిపెట్టాయి.
► అలా పలు ఫోక్, కవర్ సాంగ్స్‌తో పాటు, షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించింది సార్య.
► యూట్యూబ్‌లో ‘నచ్చినావురో’ ఫోక్ సాంగ్‌తో పాపులరై యూత్‌లో మంచి క్రేజ్ సాధించింది. అందులోని సార్య క్యూట్ హావభావాలకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. దీంతో తను చేసే ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోలకు లైకుల వర్షం కురవడం మొదలైంది.
► ఆ ఫేమ్‌తోనే సిల్వర్ స్క్రీన్ అవకాశాన్ని అందుకుంది. తొలిసారి ‘మేమ్ ఫేమస్’ సినిమాతో హీరోయిన్‌గా వెండితెరపై మెరిసింది సార్య. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోది.
పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఆయన సినిమాలో ఏ చిన్న రోల్ ఇచ్చినా చేస్తా. ఎప్పటికైనా ఆయనతో కలసి నటించాలన్నదే నా లక్ష్యం!
– సార్య
Comments
Please login to add a commentAdd a comment