Director SS Rajamouli Appreciates Mem Famous Movie Team, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

SS Rajamouli On Mem Famous Movie: యూత్‌ను ఎంకరేజ్‌ చేయండి.. దమ్ దమ్ చేయొద్దు: రాజమౌళి

Published Mon, May 29 2023 5:00 PM | Last Updated on Mon, May 29 2023 6:47 PM

SS Rajamouli Congratulates Mem Famous Movie Team - Sakshi

సుమంత్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి కీలక పాత్రల్లో అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌ నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 26న విడుదల విడుదల కాగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రంపై దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు. చాలా కాలం తర్వాత పూర్తిస్థాయిలో ఓ వినోదాత్మక చిత్రాన్ని చూశానంటూ ప్రశంసించారు. 

(ఇది చదవండి: విజయ్‌ దేవరకొండ స్టైల్‌లో 'మేమ్‌ ఫేమస్‌' రిలీజ్‌ డేట్‌)

రాజమౌళి ట్వీట్‌ రాస్తూ..'చాలా కాలం తర్వాత థియేటర్‌లో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రాన్ని చూశా. దర్శకుడు, నటుడు సుమంత్ కు మంచి భవిష్యత్ ఉంది. మేమ్ ఫేమస్‌లో  నటించిన వారంతా ఎంతో సహజంగా నటించారు. ముఖ్యంగా అంజిమామ అదరగొట్టేశాడు. ఈ మూవీ చూడాల్సిందిగా ప్రతి ఒక్కరికీ రెకమెండ్ చేస్తున్నా. యూత్‌ను ఎంకరేజ్ చేయాలి.. దమ్ దమ్ చేయొద్దు' అని పోస్ట్ చేశారు.

(ఇది చదవండి: Mem Famous Review: ‘మేమ్‌ ఫేమస్‌’ మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement