థియేటర్లో సినిమా వీక్షించిన రాజమౌళి.. వీడియో వైరల్! | Tollywood Director SS Rajamouli Watching Mathu Vadalara 2 Movie Premiere Show, Video Goes Viral | Sakshi
Sakshi News home page

SS Rajamouli: ప్రీమియర్ షోలో దర్శకధీరుడు రాజమౌళి.. వీడియో వైరల్!

Published Fri, Sep 13 2024 12:09 PM | Last Updated on Fri, Sep 13 2024 12:38 PM

Tollywood Director SS Rajamouli at Mathu vadalara 2 Premiere Show

శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం మత్తువదలరా- 2. ఈ చిత్రంలో కమెడియన్ సత్య కీలక పాత్ర పోషించారు. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీని తెరకెక్కించారు. రీతేష్‌ రానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌కు ఆడియన్స్‌న నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. అంతేకాకుండా దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్ ట్రైలర్‌ బాగుందని అభినందించారు.

ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ షోకు సైతం రాజమౌళి హాజరయ్యారు. థియేటర్లలో అందరితో కలిసి చిత్రాన్ని వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. అంతకుముందు మత్తువదలరా-2 ప్రమోషన్లలోనూ రాజమౌళి పాల్గొన్నారు. మూవీ టీంతో కలిసి సరదా స్కిట్‌ కూడా చేశారు. ప్రమోషన్లలో భాగంగా మహేశ్‌ బాబుతో తెరకెక్కించబోయే మూవీ అప్‌డేట్‌ గురించి ఆరాతీయగా.. పెద్దకర్రతో రాజమౌళి కొట్టబోయారు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరలైన సంగతి తెలిసిందే.

(ఇది చదవండి: మత్తు వదలరా-2 ట్విటర్‌ రివ్యూ.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?)

కాగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం  మహేశ్‌బాబుతో తెరకెక్కించనున్నారు. యాక్షన్‌ అడ్వెంచరస్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం ఈ మూవీ పనులతో రాజమౌళి బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాదిలో షూటింగ్‌ ప్రారంభించే అవకాశముంది. ఈ సినిమా కోసమే మహేశ్ బాబు సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement