షార్ట్ ఫిలింస్‌తో ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం మేమ్ ఫేమస్. ఊర్లో బలాదూర్‌గా తిరిగే ముగ్గురి యువకులు ఎలా ఫేమస్ అయ్యారనేదే కథ. కామెడీ పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. మే 26న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ నెల రోజుల తర్వాత నేటి(జూన్ 30) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్‌లో సినిమా చూడటం మిస్ అయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి..
మేమ్ ఫేమస్ విషయానికి వస్తే.. 'మేజర్', 'రైటర్ పద్మభూషణ్' తర్వాత చాయ్ బిస్కెట్ అధినేతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర.. లహరి ఫిల్మ్స్ చంద్రు మనోహర్ నిర్మాణ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్యామ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. కథేంటంటే.. బండనర్సంపల్లి గ్రామానికి చెందిన మహేశ్ అలియాస్ ముగ్గురు కుర్రాళ్లు ప్రాణ స్నేహితులు. వీరు ఊర్లో అల్లరిచిల్లరగా తిరుగుతూ అందరితో తిట్లు తిట్టించుకుంటారు.
ఈ ముగ్గురికీ చెరో లవ్‌స్టోరీ ఉంది. అయితే గ్రామంలో జరిగిన ఓ సంఘటన వల్ల తాము కూడా పని చేసి శభాష్ అనిపించుకోవాలనుకుంటారు. అందుకోసం ఓ టెంట్‌హౌస్ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత వీళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి? ఫేమస్ యూట్యూబ్ చానల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ చానల్ ద్వారా ఊరికి ఎలాంటి మేలు జరిగింది? ఆవారాగా తిరిగే ఆ ముగ్గురు ఎలా ఫేమస్ అయ్యారు? అనేదే మిగతా కథ.
చదవండి: ఇంట్లో జరిగిన పెళ్లికి భార్యాపిల్లలు డుమ్మా.. చేతులు జోడించి క్షమాపణలు కోరిన నటుడు!
Comments
Please login to add a commentAdd a comment