Raai Laxmi Re-entry Into Kollywood, Wolf Poster Released - Sakshi
Sakshi News home page

Raai Laxmi : సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న బోల్డ్‌ బ్యూటీ రాయ్‌లక్ష్మీ

Published Sat, May 6 2023 8:17 AM | Last Updated on Sat, May 6 2023 12:00 PM

Raai Laxmi Reentry Into Kollywood Poster Release - Sakshi

రాయ్‌లక్ష్మి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మోడలింగ్‌ రంగం నుంచి వచ్చిన బోల్డ్‌ అండ్‌ బ్యూటీ ఈమె. కర్క కసడర చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళం, మలయాళం చిత్రాలలో అత్యధికంగా కథానాయకిగా నటించింది. అదేవిధంగా తెలుగు, హిందీ, భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గ్లామరస్‌ నటి అనే ముద్రను వేసుకున్న నటి రాయ్‌లక్ష్మి.

అందుకు కారణం సినిమాల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లోని అందాల ఆరబోతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడమే. చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌లోనూ నటించి కురక్రారును గిలిగింతలు పెట్టించింది. కాగా ఈ 34 ఏళ్ల భామ ఇప్పటికీ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అన్నది గమనార్హం. కాగా ఇటీవల అవకాశాలు లేక సినిమాలకు దూరమైన రాయ్‌లక్ష్మి మల్లీ గ్యాప్‌ తర్వాత మళ్లీ కోలీవుడ్‌ రాబోతోంది.

ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్న ఉల్ఫ్‌ చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతోంది. వినోద్‌ వెంకటేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన ప్రకటనను రేపు (ఆదివారం)విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇది తనకు కంబ్యాక్‌ చిత్రం అవుతుందని ఆశాభావాన్ని రాయ్‌లక్ష్మి వ్యక్తం చేసింది. ఇకపోతే శుక్రవారం తన 34వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా చిత్ర వర్గాలు రాయ్‌లక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement