బాలీవుడ్‌ కొత్త జంట వివాహ వేదిక గురించి ఆసక్తికర విషయాలు తెలుసా ? | Raj Kumar Rao And Patralekha Wedding Venue Intresting Facts | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ కొత్త జంట వివాహ వేదిక గురించి ఆసక్తికర విషయాలు తెలుసా ?

Published Tue, Nov 16 2021 9:24 PM | Last Updated on Tue, Nov 16 2021 9:28 PM

Raj Kumar Rao And Patralekha Wedding Venue Intresting Facts - Sakshi

Raj Kumar Rao And Patralekha Wedding Venue Intresting Facts: బాలీవుడ్‌ హీరో రాజ్‌ కుమార్‌ రావు వివాహం చిరకాల ప్రేయసి పత్రలేఖతో చండీగఢ్‌లో అత్యంత సన్నిహితుల మధ‍్య జరిగింది. నవంబర్‌ 15న చండీగఢ్‌లోని 'ది ఒబెరాయ్‌ సుఖ్‌ విలాస్‌ స్పా రిసార్టు', వీరి వివాహానికి చిరునామాగా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అభిమానులను ఎంతో ప్రేమగా ఆకట్టుకున్నాయి. రాజ్ కుమార్, పత్రలేఖ వారి పెళ్లి కోసం ఎంపిక చేసుకున్న ఈ విలాసవంతమైన రిసార్టు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా. 

విలాసవంతమైన 'ది ఒబెరాయ్‌ సుఖ్‌ విలాస్‌ స్పా రిసార్టు' 8 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. చుట్టూ పచ్చని ప‍్రకృతి దృశ్యాలు, నీటి వనరులతో నిండి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రిసార్ట్‌ హిమాలయాలకు దిగువన గ్రేట్‌ సిస్వాన్‌ అటవీకి సమీపంలో ఉంది. రిసార్ట్‌లో ప్రైవేట్‌ పూల్స్‌, ఆయుర్వేద, వెల్‌నెస్‌ ప్రోగ్రామ్స్‌ వంటి సౌకర్యాలు ఉన్నాయి. రూ. 30,500 నుంచి రూ. 6,00,000 మధ్య 5 కేటగిరీల్లో గదులను ఎంపిక చేసుకోవచ్చు.

నూతన వధూవరులు రాజ్‌ కుమార్‌, పత్రలేఖ తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. 'చివరికి 11 ఏళ్ల ప్రేమ, రొమాన్స్‌, స్నేహం, వినోదం తర్వాత ఇవాళ నా సర‍్వస్వం, సోల్‌మేట్‌, బెస్ట్‌ ఫ్రెండ్‌ను వివాహం చేసుకున్నాను. నేను పత్రలేఖ భర్త అని పిలింపించుకోవడం కంటే ఆనందం మరొకటి లేదు.' అని రాజ్‌ కుమార్‌ తన అనుభూతిని షేర్‌ చేసుకున్నారు. మరోవైపు పత్రలేఖ ' నా 11 ఏళ్ల బెస్ట్‌ ఫ్రెండ్‌, సోల్‌మేట్‌, సర్వస్వం, ప్రియుడు, అన్నింట్లో భాగస్వామిని పెళ్లి చేసుకున్నాను. మీ భార్య అనే అనుభూతి కంటే గొప్ప అనుభూతి లేదు.' అంటూ రాసుకొచ్చారు.  

చదవండి: చిరకాల ప్రేయసిని పెళ్లాడిన బాలీవుడ్‌ నటుడు.. ఫోటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement