ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల.. టాలీవుడ్‌లో అనేక సినిమాల్లో నటించాడు. చిన్న చిత్రాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు అన్నింటినీ కవర్ చేశాడు. సై, స్టూడెంట్ నెం.1, ఎ ఫిలిం బై అరవింద్, విక్రమార్కుడు, రంగస్థలం, నాన్నకు ప్రేమతో, ఆర్‌ఆర్‌ఆర్.. ఇలా ఎన్నో వైవిధ్య చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇండస్ట్రీలో అందరివాడు అనిపించుకున్న రాజీవ్ కనకాల గతకొంతకాలంగా కొద్దిగా లావయ్యాడు.
రోజూ రాత్రి పావుకిలో పైనే స్వీట్స్..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను లావవడం వెనక గల కారణాన్ని బయటపెట్టాడు. రాజీవ్ మాట్లాడుతూ.. 'ఆ మధ్య నాకు ఫుడ్ పాయిజన్ అయింది. ఆస్పత్రిలో జాయిన్ అయితే సెలైన్స్ ఎక్కించారు, యాంటిబయాటిక్స్ ఇచ్చారు. అప్పుడు ఆస్పత్రిలో ఫుడ్ ఇచ్చేవారు, అటు ఇంటి నుంచి ఆహారం వచ్చేది. ఏదీ వృథా చేయకూడదన్న ఉద్దేశ్యంతో అంతా తినేసేవాడిని. డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాక రోజూ రాత్రి స్వీట్స్ తినాలనిపించేది. పావు కిలో నుంచి అరకిలో వరకు రోజూ స్వీట్స్ లాగించాను. అలా తెలియకుండానే బరువు పెరిగాను.
కాలు బెణికి నడవలేకపోయా..
ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా వరంగల్‌లో క్రికెట్ ఆడాను. ఆ సమయంలో కాలు బెణికింది. దీనికి తోడు లావు పెరగడంతో సరిగా నడవలేకపోయాను. నేను తినేటప్పుడు ఎవరైనా చాలు, ఆపేయని చెప్తే మాత్రం చాలా కోపమొస్తుంది. అందుకని నేను తినేటప్పుడు వద్దని దాదాపు ఎవరూ చెప్పరు. ప్రస్తుతం బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నాను' అని తెలిపాడు రాజీవ్ కనకాల. కాగా రాజీవ్- యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల 'బబుల్‌గమ్' సినిమాతో ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే!
చదవండి: ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ లేపుతున్న ఫ్లాప్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే
Comments
Please login to add a commentAdd a comment