ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన సెలబ్రెటీలు తమకు సంబంధించిన పాత జ్ఞాపకాలను, చిన్ననాటి ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా నటుడు రాజీవ్ కనకాలను షేర్ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు ఓ అభిమాని పట్ల ఆయన చూపించిన ఔదార్యానికి ఫిదా అవుతున్నారు. ఓ అభిమానితో సెల్ఫీ తీసుకున్న ఫొటోను తన ట్విటర్‌లో శుక్రవారం షేర్ చేస్తూ 2018లో ఎయిర్‌పోర్టులో తనకు ఎదురైన అనుభవం గురించి రాజీవ్ వివరించాడు.
‘ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఇది 2018 నాటి ఫొటో. చెన్నై ఎయిర్ పోర్టులో ఒకసారి నేను నడుచుకుంటూ వెళుతున్నాను. అక్కడే క్లీనింగ్ డిపార్టుమెంటులో పనిచేసే ఓ వ్యక్తి నన్ను చూసి పరుగెత్తుకుంటు వచ్చాడు. అప్పుడు అతని మొహంలో ఉత్సహాన్ని చూశాను. ఆనందంతో అతడి మొహం వెలిగిపోతుంది. ఇక నా దగ్గరికి వచ్చి తన గురించి చెప్పి పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత తన దగ్గర స్మార్ట్ ఫోన్ లేదని నా ఫోన్‌లోనే సెల్ఫీ తీయమని కోరాడు. నేను తీశాను. ఆ తర్వాత దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామనుకున్నా కానీ, మరిచిపోయాను. అయితే ఇప్పుడు పోస్టు చేస్తున్నాను. ఆ వ్యక్తికి ఈ పోస్టు చేరి, ఈ ఫొటోను సేవ్ చేసుకుంటాడని ఆశిస్తున్నా’ అంటు రాసుకొచ్చాడు.
అయితే సాధారణంగా తమ అభిమాన నటీనటులను చూడగానే అభిమానులు ఉప్పోంగిపోతారు. మరు క్షణం ఆలోచించకుండా వారి దగ్గరకి పరుగులు తీసి సెల్ఫీలు తీసుకుంటారు. అయితే కొన్ని సార్లు సెలబ్రిటీ మూడ్ సరిగా లేకపోతే.. అభిమానులకు చీవాట్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అభిమానులకు సెల్పీ ఇచ్చామా వెళ్లిపోయామా అన్నట్టు ఉండే సెలబ్రెట్రీలతో పోల్చితే రాజీవ్ భిన్నమని నిరుపించుకున్నాడు. ‘ఇంతకాలం వరకు కూడా ఓ అభిమాని సెల్పీని మీ ఫోన్‌లో ఉంచుకున్నారంటే మీరు గ్రేట్ సార్’, ‘మీ ఔదార్యానికి హాట్సాఫ్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Iam not aware of this person but, this was in 2018 when I was walking to catch my flight in Chennai Airport. He belongs to the airport staff cleaning department.
— Rajeev kanakala (@RajeevCo) June 3, 2021
With lots of excitement on his face, he rushed towards me, introduced himself, pic.twitter.com/rI2ZlveHiI
Comments
Please login to add a commentAdd a comment