
ఆర్‌ఆర్‌ఆర్ వంటి పాన్ ఇండియా చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తదుపరి చిత్రం RC15. సెన్సెషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంతో భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కర్నూల్‌లో షూటింగ్‌ను జరపుకుంటోంది. అయితే తాజాగా రామ్ చరణ్ తన డాన్స్ స్కిల్‌తో శంకర్‌ను ఇంప్రెస్ చేశాడట.
చదవండి: పెళ్లికి ముందే తల్లయిన హీరోయిన్.. కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్ పిక్స్ షేర్ చేస్తూ..
అతి కష్టమైన స్టెప్‌ను సింగిల్ టేక్‌లో చేసి మెప్పించాడట. ఈ తాజా బజ్ ప్రకారం.. 80 సెకన్ల నిడివి గల క్రిటికల్ డాన్స్ స్టెప్‌ను చరణ్ సింగిల్ టేక్‌లో చేశాడట. ఇక చరణ్ ఎనర్జీ, డాన్స్ స్కిల్ చూసి అక్కడ ఉన్న మూవీ యూనిట్ మాత్రమే కాదు డైరెక్టర్ శంకర్ సైతం ఆశ్చర్యపోయాడట. సాధారణంగా శంకర్ ఏ ఆర్టిస్ట్ విషయంలో అంత ఈజీగా ఇంప్రెస్ కాడు. కానీ చరణ్ మాత్రం తన డాన్స్ స్కిల్‌తో శంకర్‌ని మెప్పించడం విశేషం. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు తెగ మురిసిపోతున్నారు.
చదవండి: పొలిటికల్ లీడర్‌తో గుట్టుచప్పుడు కాకుండా హీరోయిన్ పెళ్లి
కాగా చరణ్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రిని మించిన మెగా తనయుడిగా చరణ్ తన నటన, డాన్స్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు. రీసెంట్‌గా ఆయన నటించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు తనదైన డాన్స్ స్టెప్పులతో అదరగొట్టాడు. ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఫిదా అయ్యారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కెటగిరిలో నాటు నాటు ఆస్కార్‌కు నామినేట్ అయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment