విక్కీ కౌశల్ హీరోగా నటించిన హిస్టారికల్ మూవీ ‘ఛావా’. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా దర్శకుడు లక్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ నటించగా, శంభాజీ మహారాజ్ భార్య మహారాణి ఏసుబాయి పాత్రలో రష్మికా మందన్నా నటించారు.
ఈ పాత్రలో రష్మికా మందన్నా, మొగల్ షెహన్షా ఔరంగజేబు పాత్ర చేసిన అక్షయ్ ఖన్నా లుక్స్‌ని చిత్రయూనిట్ మంగళవారం అధికారికంగా విడుదల చేసి, ‘ఛావా’ ట్రైలర్‌ను నేడు (బుధవారం) విడుదల చేయనున్నట్లుగా వెల్లడించింది. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్.
Comments
Please login to add a commentAdd a comment