'నిన్ను మిస్ అవుతున్నా'.. రష్మిక విషాదకర పోస్ట్! | Rashmika Mandanna Mourns The Death Of Her Pet | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: 'నిన్ను చాలా మిస్ అవుతున్నా'.. రష్మిక విషాదకర పోస్ట్!

Published Wed, Jul 17 2024 5:42 PM | Last Updated on Wed, Jul 17 2024 5:52 PM

Rashmika Mandanna Post Goes Viral On Instagram Stories

గతేడాది యానిమల్‌తో సూపర్‌ కొట్టిన ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్‌ సరసన మెప్పించింది. ప్రస్తుతం రష్మిక మోస్ట్ అవైటేడ్ చిత్రం పుష్ప-2. బన్నీ- సుకుమార్‌ కాంబోలో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప పార్ట్-1లో శ్రీవల్లిగా మెప్పించిన భామ.. సీక్వెల్‌తోనూ ఫ్యాన్స్‌ను అలరించనుంది. పుష్ప-2 ఈ ఏడాది డెసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. రష్మిక తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న మ్యాక్సీ అనే కుక్క చనిపోయిందని ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.  'రెస్ట్ ఇన్‌ పీస్‌ మై లిటిల్‌ గుడెస్ట్ మ్యాక్సీ.. నిన్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది..' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. తాను ఎంతో అప్యాయంగా డాగ్‌ చనిపోవడంతో ఎమోషనల్‌ పోస్ట్ చేసింది. ప్రస్తుతం రష్మిక చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. 

dog

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement