పరిశ్రమలో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది రష్మక మందన్నా. కన్నడ నుంచి తెలుగులోకి వచ్చిన రష్మిక సౌత్ స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతోంది. అంతేకాదు ఇండియన్ నేషనల్ క్రష్ 2019గా అరుదైన గుర్తింపు కూడా పొందింది ఈ భామ. ఇక తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియా షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో నెట్టింట ఆమెకు ఫాలోవర్స్ కూడా ఎక్కువే. సమంత, రకుల్ మాదిరిగానే రష్మిక కూడా తరచూ తన జిమ్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన జిమ్ ట్రైనర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రష్మిక.
చదవండి: ఆహాతో నాకు సంబంధం లేదు, గమనించగలరు: అల్లు శిరీష్ ట్వీట్ వైరల్
రష్మిక జిమ్ ట్రైనర్ కుల్దీప్ ‘సామి సామి’ పాటకు స్టెప్పులేశాడు. ఇది చూసిన పుష్ప హీరోయిన్ తన ట్రైనర్ మీద సెటైర్ వేసింది. కుల్దీప్ జిమ్‌లో ట్రైనింగ్ సెషన్‌లో భాగంగా వర్కౌట్స్ సరిగ్గా చేయమంటూ నన్ను టార్చర్ చేస్తుంటాడు, వద్దన్నా చేయిస్తూ ఉంటాడని చెప్పింది. అయితే ఇలా సామి సామి సాంగ్‌కు స్టెప్పులు వేస్తాడని తెలిస్తే దగ్గరుండి నేనే ఆ స్టెప్పులు నేర్పిస్తూ మళ్ళీ మళ్ళీ చేయమని రివేంజ్ తీసుకునేదాన్ని. మిస్ అయ్యాను అని తన ఇన్‌స్ట్రాగ్రామ్ స్టోరీలో పోస్ట్ షేర్ చేసింది రష్మిక. దీంతో ఆ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
చదవండి: ‘బంగార్రాజు’ మూవీ డైరెక్టర్‌కు తమిళ నిర్మాత భారీ ఆఫర్
\
కాగా రష్మిక తాజాగా నటించిన పుష్ప మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఇందులోని పాటలకు కూడా సోషల్ మీడియాల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. పుష్పలో రష్మిక-బన్నీల సాంగ్ రారా సామీ పాటకు ఏ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాట దేశాలు కూడా దాటింది. విదేశీయులు సైతం రారా సామీ పాటకు స్టెప్పులు వేస్తూ వీడియోలు షేర్ చేస్తున్నారు. తాజాగా రష్మిక జిమ్ ట్రైనర్ కుల్దీప్ సేతీ కూడా సామీ సామీ పాటకు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment