సినీ పరిశ్రమలో హీరోయిన్లకు, కమెడియన్లకు, ఇతరత్రా సెలబ్రిటీలకు వయసైపోతుందేమో కానీ హీరోలకు మాత్రం కాదు! ఒక్కసారి హీరోగా పేరు తెచ్చుకున్నారంటే ఏళ్లకు ఏళ్లు హీరోగానే స్థిరపడిపోతారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని వుడ్స్‌లోనూ ఇదే పరిస్థితి! వాళ్లు హీరోగా నటిస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేయడం సరే కానీ తమ కూతురి వయసున్న నటీమణులతో రొమాన్స్ చేయడమే చాలామందికి మింగుడుపడటం లేదు. కానీ దర్శకనిర్మాతలు, హీరోలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.
తాజాగా ఇదే విషయం గురించి మాట్లాడింది సీనియర్ నటి రత్న పాఠక్ షా. 'దీని గురించి ఏమని మాట్లాడాలో కూడా తెలియడం లేదు. కూతురి వయసున్న హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయడానికి వారికి ఏమాత్రం సిగ్గుగా అనిపించడం లేదు.. అలాంటప్పుడు నేనేం మాట్లాడగలను? నేను చెప్పడానికి ఏం లేదు. దీని గురించి మాట్లాడటం నాకే సిగ్గుగా ఉంది.
కానీ కచ్చితంగా ఏదో ఒక రోజు మార్పు వస్తుంది. ఆడవాళ్లు నేడు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వాళ్లు సినీ ఇండస్ట్రీలోనూ కచ్చితంగా అద్భుతాలు చేయగలరు. దీనికి కొంత సమయం పడుతుందేమో కానీ తప్పకుండా జరిగి తీరుతుంది' అని చెప్పుకొచ్చింది. కాగా రత్న పాఠక్ షా.. లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా, ఖుబ్సూరత్, కపూర్ అండ్ సన్స్ వంటి హిట్ చిత్రాల్లో నటనతో అదరగొట్టింది. ప్రస్తుతం ఆమె నటించిన ధక్ ధక్ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది.
చదవండి: ముంబైకి షిఫ్ట్ అయిన మంచు లక్ష్మి.. ఆడిషన్స్‌కు కూడా రెడీ అంటూ..
Comments
Please login to add a commentAdd a comment