మాస్ మహారాజ్ రవితేజ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘క్రాక్’. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక సినిమా సక్సెస్‌తో జోష్‌లో ఉన్న రవితేజ పలు ఇంటర్వ్యూ ఇస్తూ బిజీ అయిపోయారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆయనకు తన ఫస్ట్ రెమ్మూనరేషన్ ఎప్పుడు తీసుకున్నారనే ప్రశ్న ఎదురైంది. దీనికి మాస్ రాజా ‘నిన్నే పెళ్లాడతా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిప్పుడు నా తొలి చెక్కును అందుకున్నాను. అప్పుడు 3500 రూపాయల చెక్కును హీరో నాగార్జున చేతుల మీదుగా తీసుకున్నాను. అదే నా మొదటి రెమ్యూనరేషన్ కావడంతో ఆ చెక్కుని చాలా కాలం వరకు భధ్రంగా దాచుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. (చదవండి: రవితేజ టాప్ ఫాంలో ఉన్నారు: రామ్‌చరణ్)
అయితే ఓ సారి డబ్బులు అవసరం పడటంతో ఆ చెక్‌ను బ్యాంక్‌కు వెళ్లి మార్చేశానన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా రాణిస్తున్న రవితేజ తన కెరీర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సహానటుడుగా పలు సినిమాల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమకు వచ్చిన రవితేజ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఆ తర్వాత సహానటుడుగా నటించి ఇప్పడు పరిశ్రమలో అగ్రహీరోగా రాణిస్తూ ఒక్కో సినిమా 10 కోట్ల రూపాయలకు మించి తీసుకుంటున్నారు. అంతేగాక టాలీవుడ్ మాస్‌మహరాజాగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపును కూడా తెచ్చుకున్నారు. (చదవండి: రివ్యూ టైమ్: మాస్ మసాలా వయొలెంట్ క్రాక్)
Comments
Please login to add a commentAdd a comment