ఆర్కాడీ ప్రపంచంలోకి... | Saidurga Tej latest movie SDT 18 teaser: Tollywood | Sakshi
Sakshi News home page

ఆర్కాడీ ప్రపంచంలోకి...

Oct 16 2024 12:07 AM | Updated on Oct 16 2024 12:07 AM

Saidurga Tej latest movie SDT 18 teaser: Tollywood

సాయిదుర్గా తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌డీటీ 18’ (వర్కింగ్‌ టైటిల్‌). నూతన దర్శకుడు రోహిత్‌ కేపీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై  కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్యా రెడ్డి ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం (అక్టోబరు 15) సాయిదుర్గా తేజ్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని ‘ఇంట్రూడ్‌ ఇన్‌ టు ది వరల్డ్‌ ఆఫ్‌ ఆర్కాడీ’ (ఆర్కాడీ ప్రపంచంలోకి ప్రవేశించండి) అనే వీడియోను విడుదల చేశారు మేకర్స్‌.

 ‘‘హై పీరియడ్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఎస్‌డీటీ 18’. మునుపెన్నడూ చేయని పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు సాయిదుర్గా తేజ్‌. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement