ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌తో జోడీ కట్టింది. 'వీర్గతి(1995)' మూవీలో సల్మాన్ సరసన హీరోయిన్‌గా నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. కానీ ఆమె మాత్రం ప్రేక్షకుల మనసు గెలిచింది. ఆ హీరోయినే పూజా దద్వాల్. దీనికంటే ముందు 'జీనే నహీ దూంగీ' అనే సినిమాలోనూ తళుక్కుమని మెరిసింది. సినిమాల్లో లక్ కలిసి రావడం లేదని టీవీలోనూ ప్రయత్నించింది. ఇక్కడ పేరు తెచ్చుకుంటే సినిమా అవకాశాలు వస్తాయని కలలు కంది. అయినా పెద్ద ఉపయోగం లేకపోయింది. అడపాదడపా సినిమాలు చేసింది కానీ నిలదొక్కుకోలేకపోయింది. సినిమాల మీద ఆశ చాలించుకుని పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి గోవాలో సెటిలైంది.
టీబీతో జీవితం అతలాకుతలం
జీవితం సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో ఒకరోజు సడన్‌గా వీక్‌నెస్‌తో కిందపడిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా తనకు టీబీ ఉందని తెలిసింది. ఈ విషయం తెలియగానే ఆమె భర్త, అత్తామామ తనను వదిలించుకోవాలని చూశారు. ముంబైలో వదిలేశారు. కన్నవాళ్లు, స్నేహితులు.. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అందరూ ఉన్న అనాథ అయిపోయింది. ఆ సమయానికి పూజ చేతిలో డబ్బు, ఆరోగ్యం, ఉద్యోగం.. ఇలా ఏదీ లేదు. చావు కోసం ఎదురుచూడటం తప్ప చేయగలిగేదేముందనుకుంది. ఆ సమయంలో దర్శకుడు రాజేంద్ర సింగ్ ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు.
సాయం చేసిన హీరో
తనతోపాటు యాక్ట్ చేసిన సల్మాన్‌ను ఓసారి సాయం అడిగి చూద్దామనుకుంది. 'ప్రస్తుతం నా దగ్గర చిల్లిగవ్వ లేదు. కనీసం టీ తాగాలన్నా ఇతరులపైనే ఆధారపడుతున్నాను. సల్మాన్ సాయం చేస్తే బాగుంటుంది' అని చెప్పింది. ఆ వీడియో సల్మాన్ దాకా చేరింది. ఆమె పరిస్థితి చూసి చలించిపోయాడు. తన ఫౌండేషన్‌కు చెప్పి చికిత్స, ఆహారం, బట్టలు.. ఇలా ప్రతీది అందించాడు. అతడు అందించిన సహకారంతో ఐదు నెలల్లో కోలుకుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు.. తాను బతికి ఉండటానికి కారణం సల్మాన్ అని.. ఆయన చేసి మేలు మరవలేనంటూ ఎమోషనలైంది.
టిఫిన్ బండి నడుపుకుంటూ..
తర్వాత ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో చిన్న గదిని అద్దెకు తీసుకుని అందులోనే నివసించడం మొదలుపెట్టింది. పొట్టకూటి కోసం ఎన్నో పనులు చేసింది. 2020లో పంజాబీ మూవీ షుక్రానా: గురునానక్ దేవ్‌జీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడటంతో తన కలలన్నీ ఛిద్రమయ్యాయి. తన పరిస్థితి చూడలేక రాజేంద్రసింగ్.. ఓ టిఫిన్ సెంటర్ పెట్టుకోమని సలహా ఇచ్చాడు. అందుకు అవసరమైన సామాగ్రి కూడా అతడే కొనిచ్చాడట. అదే ఆమె బతుకుదెరువైంది. ఇప్పటికీ అద్దె ఇంట్లో ఉంటూ ఆ టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ బతుకుబండి లాగిస్తోంది. వంద రూపాయలు వచ్చినా చాలని కష్టపడుతోంది అలనాటి అందాల తార!
చదవండి: కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించిన సామ్.. అతడి రియాక్షన్ చూశారా?
Comments
Please login to add a commentAdd a comment