స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. అనారోగ్యం కారణంగా కొంతకాలం షూటింగ్స్‌కి దూరమైన సామ్.. ఇప్పుడు పూర్తిగా కోలుకొని పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసేందుకు సిద్దమైంది. ప్రస్తుతం ‘సీటడెల్’అనే వెబ్‌సిరీస్ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఖుషీ’ మూవీ షూటింగ్‌లో పాల్గొననుంది.
ఇలా వరుస షూటింగ్స్ బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాకి టైమ్ కేటాయిస్తుంది సామ్. ఖాలీ సమయం దొరికితే చాలు.. నెట్టింట్లో వాలిపోయి అభిమానులతో అన్ని విషయాలు పంచుకుంటుంది.తాజాగా తన బెస్ట్‌ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్ ఫోటోని షేర్ చేస్తూ..అతని గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
(చదవండి: రికార్డు రెమ్యూనరేషన్: ఈ రికార్డ్ సాధించిన తొలి హీరో ఎవరో తెలుసా?)
‘మీకు తెలిసిన మంచి వ్యక్తిని తీసుకుని వందసార్లు మల్టిప్లై చేస్తే అది నా బెస్ట్ ఫ్రెండ్. రాహుల్ నిన్ను జీవితాంతం ప్రేమిస్తుంటాను’ అని సామ్ చెప్పుకొచ్చింది. రాహుల్ రవీంద్రన్ టేస్టీ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్న పిక్ షేర్ చేస్తూ.. తను ఫుడీ అయినప్పటికీ మీతో కంపెనీ ఇవ్వడానికి దాన్ని వదులుకుంటాడు. కానీ ఎంత బాధపడతాడో’ అని సరదాగా పేర్కొంది.
రాహుల్, ఆమె భార్య చిన్మయి ఇద్దరూ సమంతకు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. రాహుల్, సామ్ కలిసి ఓ తమిళ చిత్రంలో నటించారు. అప్పటి నుంచే వీరిద్దరు స్నేహితులయ్యారు. తన సినిమాలకు తెలుగు డబ్బింగ్ చెప్పడంతో చిన్మయి కూడా సామ్‌కి క్లోజ్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment