Samantha Old Comments Goes Viral When a Fan Asking About Her Pregnancy - Sakshi
Sakshi News home page

Samantha: 2022 ఆగస్ట్‌ 7వ తేదీ ఉదయం 7గంటలకు బిడ్డకు జన్మనిస్తా: సామ్‌ పాత కామెంట్స్‌ వైరల్‌

Published Tue, Feb 8 2022 7:06 PM | Last Updated on Wed, Feb 9 2022 10:42 AM

Samantha Old Comments Goes Viral When a Fan Asking About Her Pregnancy - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందుకు ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్ట్సే ఉదాహరణ. ప్రస్తుతం సామ్‌ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. విడాకుల అనంతరం సమంత మరింత బిజీ అయిపోయింది. వరస ఆఫర్స్‌ క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ఇంటర్నేషనల్‌ స్థాయికి కూడా ఎదిగింది. ఇటూ తెలుగుతో పాటు అటూ బాలీవుడ్‌, హాలీవుడ్‌లో సైతం తన మార్క్‌ చూపించేందుకు సామ్‌ సిద్దమవుతోంది. ఇదిలా ఉంటే హీరో నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సామ్‌ గతేడాది అక్టోబర్‌ 2న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

చదవండి: షారుక్‌ వీడియోపై నటి ఊర్మిళ స్పందన, ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా?

దీంతో అప్పటి నుంచి ఈ క్యూట్‌ కపుల్‌ మీడియాల్లో నిలుస్తున్నారు. చెప్పాలంటే చై కంటే కూడా సమంతే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట నాలుగేళ్లు అన్యోన్యంగా జీవించారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ మోస్ట్‌ క్యూటెస్ట్‌ కపుల్‌గా పిలిపించుకున్న చై-సామ్‌ విడాకుల ప్రకటన ఇచ్చి అందరికి షాకిచ్చారు. ఇక వీరి విడాకులకు కారణం ఏదైనా.. మళ్లీ ఈ జంట కలవాలని ఫ్యాన్స్‌ ప్రార్థిస్తున్నారు. దీంతో వారిద్దరూ అన్యోన్యంగా ఉన్న పాత వీడియోలు, గతంలో ఒకరిపై ఒకరు చేసుకున్న క్యూట్‌ కామెంట్స్‌ను ఫ్యాన్స్‌ గుర్తు చేసుకుంటు వాటిని సోషల్‌ మీడియాల్లో వైరల్‌ చేస్తున్నారు.

చదవండి: ఆర్జీవీ ట్వీట్‌, పెద్దవాళ్లపై వర్మ షాకింగ్‌ కామెంట్స్‌

ఈ నేపథ్యంలో సమంత తన ప్రెగెన్సీపై చేసిన ఆసక్తికర కామెంట్స్‌ మరోసారి తెరపై వచ్చాయి. 2019లో ఓసారి సమంత సోషల్‌ మీడియాలో లైవ్‌చాట్‌ నిర్వహించింది. ఆస్క్‌ మీ ఎనీథింగ్‌(ప్రశ్నలు-సమాధాలు) పేరుతో లైవ్‌చాట్‌కు వచ్చిన ఆమెకు ఫ్యాన్స్‌ నుంచి ప్రెగ్నెన్సీ ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె స్పందిస్తూ.. ‘నా శరీరంలో వచ్చే మార్పుల కోసం మీరంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అర్థమైంది. అలాంటి వారికి ఓ గుడ్‌న్యూస్‌ చెబుతున్నా.. 2022 ఆగస్ట్‌ 7వ తేదీ ఉదయం 7గంటలకు ఓ బిడ్డకు జన్మనివ్వబోతోన్న’ అంటూ సమాధానం ఇచ్చింది. అయితే గతంలో సమంత చేసిన ఈ కామెంట్స్‌ను చై-సామ్‌ ఫ్యాన్స్‌ వైరల్‌ చేస్తూ భావోద్వేగానికి లోనవుతున్నారు. అంతా బాగుంటే సామ్‌ చెప్పినట్టుగానే ఈ ఏడాది వారికి ఓ బిడ్డ కూడా పుట్టేది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement