
నాగ చైతన్యతో విడాకులు అనంతరం సమంత కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో తన దగ్గరికి వచ్చిన ఆఫర్లకు నో చెప్పకుండా వీలైనంత బిజీగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సామ్ దాదాపు అరడజను సినిమాలను లైన్‌లో పెట్టింది. అంతేగాక స్పెషల్ సాంగ్స్, కమర్షియల్ యాడ్స్‌తో పాటూ బిజినెస్‌లో యాక్టివ్ ఉంటుంది. ఇలా రెండూ చేతులా సంపాదిస్తున్న సమంత తాజాగా మరో కమర్షియల్‌లో కనిపించింది.
చదవండి: నేను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా: మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్
దీంతో ఆమెను నెటిజన్లు, అక్కినేని ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇదివరకు కొన్ని కమర్షియల్ ప్రోడక్ట్స్‌ను తన సోషల్ మీడియాలలో ప్రమోట్ చేసిన సామ్ తాజాగా ఓ ఆల్కాహాల్ బ్రాండ్‌ని ప్రమోట్ చేసింది. బ్లెండర్స్ ప్రైడ్ అనే ఆల్కహాల్ బ్రాండ్ ప్రమోట్ చేస్తూ ఓ ప్రకటనలో నటించింది. ఈ వీడియోలో సామ్ కొంచెం బోల్డ్‌గా కనిపించింది. దీంతో ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదివరకు ఇలాంటి యాడ్స్‌లో నటించిన హీరోయిన్లపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి.
చదవండి: రెమ్యునరేషన్‌లో తగ్గేదే లే.. ఎవరెంత తీసుకుంటున్నారో తెలుసా?
అది తెలిసి కూడా సమంత ఇలాంటి ప్రకటనల్లో నటించడం ఆశ్చర్యంగా ఉందంటూ ఓ వర్గం వారు కామెంట్స్ చేస్తుండగా.. ‘ఛీఛీ డబ్బు కోసం ఎంతకైనా దిగుజారతావా? స్టార్ హీరోయిన్ అనే సంగతే మరిచిపోయావా?’ ‘టాప్ హీరోయిన్ అయిన నువ్వు ఒక ఆల్కహాల్ ప్రమోట్ చేయడం బాదాకరం’ అంటూ విరుచుకుపడుతున్నారు. అంతేకాదు ప్రకటనలో తన డ్రెస్సింగ్‌పై కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని బట్టి చూస్తుంటే సమంత విడాకులు అనంతరం ఎవరిని పట్టించకోకుండా తన పని తాను చేసుకుంటు పోతోందని అనిపిస్తోంది. అందుకే తనపై ఏవిధమైన ట్రోల్స్ వచ్చిన చూసిచూడనంటూ పోతోంది.
Comments
Please login to add a commentAdd a comment