
థియేటర్స్‌కు వచ్చేందుకు ‘సామాన్యుడు’ సిద్ధమయ్యాడు. విశాల్ నటించి, నిర్మించిన చిత్రం ‘సామాన్యుడు’. డింపుల్ హయతి హీరోయిన్. ఈ చిత్రానికి తు ప శరవణన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 4న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం శనివారం ప్రకటించింది. ‘‘మా సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. విశాల్ నటన హైలైట్‌గా ఉంటుంది. యువన్ శంకర్‌రాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా మార్చేసింది’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment