samanyudu
-
‘సామాన్యుడు’ వచ్చేస్తున్నాడు
థియేటర్స్‌కు వచ్చేందుకు ‘సామాన్యుడు’ సిద్ధమయ్యాడు. విశాల్ నటించి, నిర్మించిన చిత్రం ‘సామాన్యుడు’. డింపుల్ హయతి హీరోయిన్. ఈ చిత్రానికి తు ప శరవణన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 4న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం శనివారం ప్రకటించింది. ‘‘మా సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. విశాల్ నటన హైలైట్‌గా ఉంటుంది. యువన్ శంకర్‌రాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా మార్చేసింది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు ఇవే!
ఈసారి సంక్రాంతి పండగకు పెద్దగా సందడి లేకుండా పోయింది. తండ్రీకొడుకులు నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు మినహా పెద్ద సినిమాలేవీ బాక్సాఫీస్ బరిలోకి దిగలేదు. దీంతో చిన్న సినిమాల హవా నడిచింది. సంక్రాంతి సందడి సద్దుమణగగా ఇప్పుడు గణతంత్ర దినోత్సవం వస్తోంది. మరి ఈ సందర్భంగా ఈ వారం అటు థియేటర్లో ఇటు ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలేంటో చూసేద్దాం.. సామాన్యుడు తమిళ హీరో విశాల్ నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ విడుదలవుతుంటాయి. ఈ పరంపరలోనే ఆయన నటించిన సామాన్యుడు మూవీ జనవరి 26న థియేటర్లలో రిలీజవుతోంది. ఇందులో డింపుల్ హయాతీ హీరోయిన్గా నటించింది. గుడ్‌లక్ సఖి లేడీ ఓరియంటెడ్ సినిమాలపై దృష్టి సారించింది కీర్తి సురేశ్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా గుడ్‌లక్ సఖి. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కరోనా వల్ల ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఆది పినిశెట్టి, జగపతిబాబు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం జనవరి 28న రిలీజ్ కానుంది. వీటితో పాటు గోర్‌మాటి అనే బంజారా చిత్రం, దెయ్యంతో సహజీవనం.. జనవరి 28న, క్షుద్రశక్తుల మంత్రగత్తెలు జనవరి 29న థియేటర్లలోకి రానున్నాయి. ఓటీటీల విషయానికి వస్తే.. ఆహా ► అర్జున ఫల్గుణ - జనవరి 26 హాట్‌స్టార్ ► ద గిల్డెడ్ ఏజ్ వెబ్ సిరీస్ - జనవరి 25 ► ద ప్రామిస్ ల్యాండ్ వెబ్ సిరీస్ - జనవరి 25 ► బ్రో డాడీ - జనవరి 26 ► తడప్ - జనవరి 28 జీ 5 ► ఆహా (మలయాళ మూవీ) - జనవరి 26 ► పవిత్ర రిష్తా (హిందీ సీరియల్) - జనవరి 28 నెట్‌ఫ్లిక్స్ ► స్నోపియర్స్ (వెబ్ సిరీస్) - జనవరి 25 ► ది సిన్నర్ నాల్గో సీజన్ - జనవరి 26 ► ఫ్రేమ్డ్ (వెబ్ సిరీస్) - జనవరి 27 ► ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ (కొరియన్ సిరీస్) - జనవరి 28 ► గెట్టింగ్ క్యూరియస్ విత్ జొనాథన్ వాన్నెస్ (వెబ్ సిరీస్) - జనవరి 28 ► ఫెరియా (హాలీవుడ్ చిత్రం) - జనవరి 28 ► హోమ్ టౌన్ (హాలీవుడ్ చిత్రం) - జనవరి 28 ఊట్ ► బడవ రాస్కెల్ (కన్నడ మూవీ) - జనవరి 26 -
ఒక మంచి క్రైమ్ స్టోరీ చెప్పనా.. విశాల్ 'సామాన్యుడు' ట్రైలర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో విశాల్ ఎప్పుడూ విభిన్నమైన సినిమాలతో అలరిస్తుంటాడు. విశాల్ హీరోగానే కాకుండా నిర్మాతగా పలు మంచి సినిమాలను తెరకెక్కించాడు. తాజాగా విశాల్ కథానాయకుడిగా రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం సామాన్యుడు. 'నాట్ ఏ కామన్ మ్యాన్' అనేది ఉపశీర్షిక. విశాల్ తన సొంత బ్యానర్ 'విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ'పై (VFL) నిర్మిస్తున్న ఈ చిత్రానికి తు. పా. శరవణన్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం రెండు భాషల్లో విడుదలకానుంది ఈ సినిమా. ఇదివరకు విడుదలైన టీజర్, ప్రచార చిత్రాలు సామాన్యుడిపై అంచనాలు పెరిగేలా చేశాయి. తాజాగా బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. (చదవండి: ప్రభాస్ తర్వాత స్థానంలో అల్లు అర్జున్.. దేనిలో అంటే ?) ఒక మంచి క్రైమ్ స్టోరీ చెప్పనా అంటూ విశాల్ వాయిస్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. సినిమాలో రొమాంటిక్ అంశాలు ఉన్నప్పటికీ అంతకుమించి యాక్షన్ సీన్లు ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారని చెప్పడం, నేరస్థుడి పుట్టుక వంటి డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. అలాగే ఇతర సంభాషణలు హైలెట్ కానున్నాయి. యాక్షన్, ఎమోషనల్ సీన్లలో విశాల్ ఎప్పటిలానే అదరగొట్టాడు. యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు ప్లస్ కానున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ యువన్ బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. విశాల్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్గా నటించింది. కవిన్ రాజా సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పీఏ తులసి, రవీనా రవి తదితరులు నటించారు. సామాన్యుడు త్వరలో ప్రేక్షకుల మందుకు రానున్నాడు. (చదవండి: ప్రముఖ హీరోయిన్ ఇంట్లో చోరీ.. పోలీసులకు ఫిర్యాదు) -
సామాన్యుడు అలాంటి సినిమా: హీరో విశాల్
తనకు సంబంధించినంత వరకు థియేటర్లే దేవాలయాలని నటుడు, నిర్మాత విశాల్ అన్నారు. ఈయన కథానాయకుడిగా నటించి తన విశాల్ ఫిలిమ్స్‌పై నిర్మించిన చిత్రం వీరమే వాగై చుడుమ్. నటి డింపుల్ కథానాయికగా కోలీవుడ్‌లో పరిచయం అవుతున్న చిత్రం ఇది. అదేవిధంగా తు.ప.శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతన్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, ప్రవీణ్ రాజ్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ నెల 26వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. తెలుగులో సామాన్యుడు అనే టైటిల్‌ను నిర్ణయించారు. కాగా చిత్రం కథ కంటే కథనం చాలా నచ్చిందని విశాల్ అన్నారు. దర్శకుడు శరవణన్‌కు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. కొత్త దర్శకులు చెప్పిన కథ నచ్చితే దానికి యువన్ శంకర్ రాజానే సంగీతం అందిస్తారని చెబుతానన్నారు. హీరోలను దృష్టిలో పెట్టుకుని తీసిన చిత్రాలు కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయని, అయితే మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చిన కుటుంబకథా చిత్రాలన్నీ విజయవంతమవుతాయన్నారు. ఈ రెండవ కోవకు చెందిన చిత్రమే వాగై చుడుమ్ అని పేర్కొన్నారు. -
విశాల్ 'సామాన్యుడు' కాదు
Hero Vishal: విశాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సామాన్యుడు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ అనేది ఉపశీర్షిక. తు.ప. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఆదివారం (ఆగస్టు 29)న విశాల్ బర్త్ డే సందర్భంగా ‘సామాన్యుడు’ టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. Here We Go, Presenting the First Look & Title of #Vishal31 - #VeerameVaagaiSoodum pic.twitter.com/m6R4Q4HOM9 — Vishal (@VishalKOfficial) August 29, 2021 ‘‘విశాల్ నటించిన పలు సినిమాలకు సంగీతం అందించిన యువన్ శంకర్ రాజా ‘సామాన్యుడు’ కి కూడా సంగీతం అందిస్తున్నారు. కవిన్ రాజ్ మంచి విజువల్స్ ఇస్తున్నారు. ఈ సినిమాను త్వరలో థియేటర్స్‌లో విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
'ప్యార్ మే పడిపోయానే' మూవీ న్యూ స్టిల్స్
-
ప్రేమలో పడిపోయారు..
‘‘దర్శకుడు రవి చావలి ‘సామాన్యుడు’ సినిమాలో మా నాన్న సాయికుమార్ పాత్రను చాలా విభిన్నంగా చూపించారు. ఇందులో నా పాత్ర కూడా వైవిధ్యంగా ఉంటుంది. రెగ్యులర్ ప్రేమ కథల్లా కాకుండా సరికొత్త ప్యార్‌ని ఇందులో ఆవిష్కరించారు’’ అని ఆది చెప్పారు. ఆది, శాన్వి జంటగా రవి చావలి దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ‘ప్యార్ మే పడిపోయానే’ చిత్రం టీజర్ ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘మా సంస్థలో ఇది నాలుగో సినిమా. కులుమనాలిలో త్వరలో చిత్రీకరించబోయే రెండు పాటలతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది’’ అని తెలిపారు. ఇది మ్యూజికల్ లవ్‌స్టోరీ అని దర్శకుడు పేర్కొన్నారు. తన కెరీర్లో ఇది బెస్ట్ మూవీ అని ఛాయాగ్రాహకుడు సురేందర్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ కృష్ణారెడ్డి, కళా దర్శకుడు రమణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎమ్మెస్ కుమార్ మాట్లాడారు.