List Of Top 20 OTT And Theatre Movie Releases In January 4th Week - Sakshi
Sakshi News home page

Tollywood Movies: ఈ వారం రిలీజవుతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లిస్ట్‌ ఇదిగో!

Published Mon, Jan 24 2022 10:55 AM | Last Updated on Mon, Feb 7 2022 4:37 PM

List Of Top 20 OTT And Theatre Movie Releases In January 4th Week - Sakshi

ఈసారి సంక్రాంతి పండగకు పెద్దగా సందడి లేకుండా పోయింది. తండ్రీకొడుకులు నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు మినహా పెద్ద సినిమాలేవీ బాక్సాఫీస్‌ బరిలోకి దిగలేదు. దీంతో చిన్న సినిమాల హవా నడిచింది. సంక్రాంతి సందడి సద్దుమణగగా ఇప్పుడు గణతంత్ర దినోత్సవం వస్తోంది. మరి ఈ సందర్భంగా ఈ వారం అటు థియేటర్‌లో ఇటు ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలేంటో చూసేద్దాం..

సామాన్యుడు
తమిళ హీరో విశాల్‌ నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ విడుదలవుతుంటాయి. ఈ పరంపరలోనే ఆయన నటించిన సామాన్యుడు మూవీ జనవరి 26న థియేటర్లలో రిలీజవుతోంది. ఇందులో డింపుల్‌ హయాతీ హీరోయిన్‌గా నటించింది.

గుడ్‌లక్‌ సఖి
లేడీ ఓరియంటెడ్‌ సినిమాలపై దృష్టి సారించింది కీర్తి సురేశ్‌. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా గుడ్‌లక్‌ సఖి. నగేష్‌ కుకునూర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా కరోనా వల్ల ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఆది పినిశెట్టి, జగపతిబాబు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం జనవరి 28న రిలీజ్‌ కానుంది.

వీటితో పాటు గోర్‌మాటి అనే బంజారా చిత్రం, దెయ్యంతో సహజీవనం.. జనవరి 28న, క్షుద్రశక్తుల మంత్రగత్తెలు జనవరి 29న థియేటర్లలోకి రానున్నాయి.

ఓటీటీల విషయానికి వస్తే..

ఆహా
► అర్జున ఫల్గుణ - జనవరి 26

హాట్‌స్టార్‌
► ద గిల్డెడ్‌ ఏజ్‌ వెబ్‌ సిరీస్‌ - జనవరి 25
► ద ప్రామిస్‌ ల్యాండ్‌ వెబ్‌ సిరీస్‌ - జనవరి 25
► బ్రో డాడీ - జనవరి 26
► తడప్‌ - జనవరి 28

జీ 5
► ఆహా (మలయాళ మూవీ) - జనవరి 26
► పవిత్ర రిష్తా (హిందీ సీరియల్‌) - జనవరి 28

నెట్‌ఫ్లిక్స్‌
► స్నోపియర్స్‌ (వెబ్‌ సిరీస్‌) - జనవరి 25
► ది సిన్నర్‌ నాల్గో సీజన్‌ - జనవరి 26
► ఫ్రేమ్‌డ్‌ (వెబ్‌ సిరీస్‌) - జనవరి 27
► ఆల్‌ ఆఫ్‌ అజ్‌ ఆర్‌ డెడ్‌ (కొరియన్‌ సిరీస్‌) - జనవరి 28
► గెట్టింగ్‌ క్యూరియస్‌ విత్‌ జొనాథన్‌ వాన్‌నెస్‌ (వెబ్‌ సిరీస్‌) - జనవరి 28
► ఫెరియా (హాలీవుడ్‌ చిత్రం) - జనవరి 28
► హోమ్‌ టౌన్‌ (హాలీవుడ్‌ చిత్రం) - జనవరి 28

ఊట్‌
► బడవ రాస్కెల్‌ (కన్నడ మూవీ) - జనవరి 26

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement