సీనియర్ నటి ఊర్వశి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'చార్లెస్ ఎంటర్‌ప్రైజెస్'. నటుడు బాలు వర్గీస్, కలైయరసన్, గురుసోమసుందరం, సుజిత్ శంకర్, అభిజ శివకళ, మణికంఠన్, ఆచారిను, మృదుల మాధవ్, సుధీర్ పరవూర్ ముఖ్యపాత్రలు పోషించారు. సుభాష్ లలిత సుబ్రమణ్యం దర్శకుడిగా పరిచయం అవుతుండగా జాయ్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ అజిత్ జాయ్ తమిళం, మలయాళం భాషల్లో నిర్మించారు. కె.వి.సుబ్రమణ్యం, అశోక్ పొన్నప్పన్ కలిసి సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి స్వరూప్ పిలిప్ ఛాయాగ్రహణం అందించారు.
మలయాళంలో ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఈ చిత్రాన్ని తమిళంలో ఈ నెల 23న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఊర్వశి మాట్లాడుతూ.. సాధారణంగా తమలాంటి నటీనటులను పత్రికల వాళ్లు నీకు ఇష్టమైన నటీనటులు ఎవరు, నచ్చిన పాత్ర ఏమిటి, దర్శకుడు ఎవరు? లాంటి ప్రశ్నలు వేస్తుంటారన్నారు. అయితే ఈ చిత్రానికి బలం నిర్మాతేనన్నారు.
ఇకపై నీకు నచ్చిన నిర్మాత ఎవరు అని అడగండి అన్నారు. అలా ఈ చిత్రం నిర్మాత తనకు చాలా ఇష్టమని చెప్పారు. కొందరు నిర్మాతలపై ఫిర్యాదు కూడా చేసే అవకాశం ఉందని అన్నారు. చిత్ర కథ బాగుందా? అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఉందా? వ్యాపారపరంగానూ లాభసాటిగా ఉందా అంటూ ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్మాత అజిత్ జాయ్ ఈ చిత్రాన్ని నిర్మించారని చెప్పారు. ఇకపోతే చిన్న చిత్రమైనా పెద్ద చిత్రమైనా శ్రమ ఒకటేనని, అయితే తన చిత్రాలకు తగిన ప్రచారం లభించడం లేదని అన్నారు. ఈ చిత్రానికి మీడియా సహకారం అవసరం అని ఊర్వశి పేర్కొన్నారు.
చదవండి: షారుక్ ఖాన్‌కు చేదు అనుభవం
Comments
Please login to add a commentAdd a comment