
షణ్ముఖ్ జశ్వంత్.. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్. ఆ ఆదరణతోనే బిగ్‌బాస్ షోలో ఛాన్స్ కొట్టేసి ఐదో సీజన్‌లో పాల్గొన్నాడు. అభిమానుల అండతో ఫినాలేలో చోటు దక్కించుకుని రన్నరప్‌గా బయటకు వచ్చాడు. గెలుపుకు అడుగు దూరంలో ఆగిపోయిన అతడు ఇటీవలే వైజాగ్‌లో ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసి తనకు ఓట్లేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తాజాగా షణ్ను- దీప్తి సునయనకు బ్రేకప్ అయిన సందర్భంగా ఫ్యాన్స్ మీట్‌లో షణ్ముఖ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
'ఫ్యాన్స్ మీట్‌కు ఇంతమంది వస్తారని ఊహించలేదు. బిగ్‌బాస్ జర్నీ మీరు చూసే ఉంటారు. మీరంతా నా ఫ్యామిలీ కన్నా ఎక్కువ సపోర్ట్ చేశారు. ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నా కాబట్టే మీరంతా దొరికారు. అమ్మానాన్నల మీద ఒట్టు.. మీరంతా గర్వపడేలా చేస్తా. ప్రతి మనిషిలో మంచి ఉంటుంది. అలాగే కొన్నిసార్లు తప్పులు చేస్తుంటాడు. తప్పుల నుంచి నేర్చుకుంటాం, మంచి నుంచి డెవలప్ అవుతాం. నా తప్పులు నేను సరిదిద్దుకుంటాను'
'నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే హైదరాబాద్ వచ్చి సినిమాలు చేద్దామనుకున్నాను, కట్ చేస్తే యూట్యూబర్ అయ్యాను. కానీ ఐయామ్ నాట్ జస్ట్ ఎ యూట్యూబర్. ఒక యూట్యూబర్ సినిమాల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. దీపూ, నేను ఎన్ని గొడవలు పడ్డా మళ్లీ కలుస్తాం. కొంచెం వెయిట్ చేయండి' అని చెప్పుకొచ్చాడు షణ్నూ. కానీ వారం రోజుల్లోనే బ్రేకప్ చెప్పి అభిమానులను షాక్‌కు గురి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment