![Shkalaka Shankar Rajiv Kankala Dalari Film First Look Out - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/11/dalari.gif.webp?itok=x3wN6mtN)
Shakalaka Shankar Dalri Movie First Look Released: ‘షకలక’ శంకర్, రాజీవ్ కనకాల, శ్రీ తేజ్ ప్రధాన పాత్రల్లో గోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దళారి’. ఎస్.కె. పిక్చర్స్, ఆకృతి క్రియేషన్స్‌పై సురేష్ కొండేటి, ఎడవెల్లి వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘దళారి’ టైటిల్ అనౌన్స్ చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. గోపాల్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్, ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు.
‘‘ఈ చిత్రంలో మాస్ ఎలిమెంట్స్, సస్పెన్స్, యాక్షన్ అంశాలు ఎక్కువగా ఉంటాయి’’ అని సురేష్ కొండేటి అన్నారు. ‘‘కథ, క్వాలిటీ విషయంలో రాజీపడకుండా ఈ సినిమా చేశాం’’ అన్నారు ఎడవెల్లి వెంకట్ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: మెంటెం సతీష్, సంగీతం: గౌరహరి.
Comments
Please login to add a commentAdd a comment