హీరోయిన్ శ్రద్దాదాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ‘ఆర్య2’ ‘డార్లింగ్’ ‘నాగ వల్లి’,‘ఏక్ మినీ కథ’ వంటి సినిమాలతో గుర్తింపు పొందింది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం సహా పలు భాషల్లో 30కి పైగా నటించింది.
అయితే మెయిన్ హీరోయిన్‌గా కంటే సెకండ్ హీరోయిన్‌గానే ఎక్కువగా కనిపించింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్‌సిరీస్‌లు, టీవీ షోలతో అలరిస్తున్న శ్రద్దాదాస్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
తాజాగా ఓ పబ్‌లో డ్రింక్ తాగుతూ చిల్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment