
Shraddha Das Artham Movie Poster Released: బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్దా దాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘అర్థం’. మణికాంత్ తాళ్లగూటి దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీ లాంగ్వేజ్ చిత్రంలో మాస్టర్ మహేంద్రన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు.డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నేడు (మార్చి 4) శ్రద్ద దాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో శ్రద్ద దాస్ లుక్ సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది. ఇందులో చేతిలో పుస్తకం పట్టుకొని తీక్షణంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది శ్రద్ద దాస్. ఈ చిత్రంలో మాయ అనే సైకియాట్రిస్ట్ రోల్‌లో నటిస్తోంది.
మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై రాధిక శ్రీనివాస్ నిర్మించిన 'అర్థం' సినిమాను తమిళం, తెలుగు భాషల్లో తెరెక్కిస్తున్నారు. అలాగే మళయాళ, కన్నడ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం మాయ అనే సైకియాట్రిస్ట్ చుట్టూ తిరిగే కథతో ఆధ్యంతం ఆసక్తికరంగా సాగుతుందని డైరెక్టర్ మణికాంత్ తాళ్లగూటి అన్నారు. అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్న తన పేషెంట్లలో ఒకరైన వైతరణ్ హత్య చేశాడని నమ్మిన 'మాయ' అతనితో ఎలా ప్రవర్తిస్తుంది? ఆ హత్య మిస్టరీని ఎలా ఛేదించింది అనే పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించామని చెప్పారు. ఈ చిత్రం చిత్రంలో అజయ్, ఈటీవీ ప్రభాకర్, జబర్దస్త్ రోషిణి, లోబో, నందా దురైరాజ్, అమని, సాహితి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment