
హజారికా డిజైన్ చేయించిన కేక్‌ను కూడా షేర్ చేశారు. ‘‘అతను నన్ను ఎప్పుడూ ప్రత్యేకంగా నవ్వించేలా చేస్తుంటాడు. లక్కీ గాళ్‌గా ఫీలవుతున్నాను’’..
హీరోయిన్ శ్రుతీహాసన్ లక్కీగాళ్‌గా ఫీలవుతున్నారు. ఈ నెల 28న శ్రుతీహాసన్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ బర్త్ డే కేక్‌ను శ్రుతి ప్రియుడిగా చెప్పుకుంటున్న శాంతను హజారికా డిజైన్ చేశారు. ఈ విషయాన్ని శ్రుతీహాసన్ సోషల్ మీడియా ద్వారా పేర్కొనడంతో పాటు హజారికా డిజైన్ చేయించిన కేక్‌ను కూడా షేర్ చేశారు. ‘‘అతను నన్ను ఎప్పుడూ ప్రత్యేకంగా నవ్వించేలా చేస్తుంటాడు. లక్కీ గాళ్‌గా ఫీలవుతున్నాను’’ అని పేర్కొన్నారు శ్రుతి. బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్, ప్రభాస్ ‘సలార్’లో హీరోయిన్‌గా శ్రుతీహాసన్ బిజీగా ఉన్నారు.