
హీరోయిన్ శృతి హాసన్ 2021కి వీడ్కోలు చెప్పేముందు అభిమానులతో చిట్‌చాట్ చేసింది. ఏవైనా సందేహాలు ఉంటే సంధించమని సూచించింది. దీంతో ఫ్యాన్స్ దొరికిందే ఛాన్స్ అంటూ నానా ప్రశ్నలు అడిగి ఆమె సహనానికి పరీక్ష పెట్టారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ 'నీకు ఎన్ని బ్రేకప్స్ అయ్యాయి?' అని అడిగాడు. ఈ ప్రశ్నతో చిర్రెత్తిపోయిన శృతీ.. నీకెంత మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు? బహుశా ఎవరూ లేరేమో ఒకవేళ ఉన్నా హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ అయి ఉంటారులే అంటూ కౌంటరిచ్చింది.
కాగా శృతీ హాసన్ ప్రస్తుతం సాంతను హజారికతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆమె చివరిసారిగా లాభం సినిమాలో కనిపించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment