Actress Shubra Aiyappa Marries Vishal Sivappa In Coorg, Wedding Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Shubra Aiyappa Marriage: పెళ్లి చేసుకున్న హీరోయిన్‌.. ఫోటోలు వైరల్‌

Published Thu, Jan 19 2023 5:30 PM | Last Updated on Thu, Jan 19 2023 6:04 PM

Shubra Aiyappa Marries Vishal Sivappa, Photos Goes Viral - Sakshi

నటి శుభ్ర అయిప్పా జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. బ్యాచ్‌లర్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసి పెళ్లిపీటలెక్కింది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విశాల్‌ శివప్పతో ఏడడుగులు నడిచింది. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో గురువారం వీరి వివాహం జరిగింది. 150 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రాచీన ఇంట్లో ఈ వేడుక జరిగింది. తన పెళ్లి శుభవార్తను శుభ్ర సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంది. మెడలో తాళి పడిన సందర్భం, భర్త తన నుదుటన సింధూరం దిద్దిన క్షణాలను ఫోటోల రూపంలో క్లిక్‌మనిపించగా వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

ఈ ఫోటోల్లో శుభ్ర పట్టుచీరలో నిండుగా ముస్తాబవగా ఆమె ముఖంలో పెళ్లికళ ఉట్టిపడుతోంది. ఈ పోస్ట్‌పై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సంయుక్త హెగ్డే, శాన్వి శ్రీవాత్సవ, ప్రణీత, మహత్‌ రాఘవేంద్ర పలువురూ కంగ్రాచ్యులేషన్స్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇకపోతే శుభ్ర.. ప్రతినిధి అనే తెలుగు చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సగపాతంతో తమిళ్‌లో అడుగు పెట్టింది. అదే ఏడాది వజ్రకాయతో కన్నడ రంగంలోనూ ప్రవేశించింది. ప్రస్తుతం ఆమె నటించిన రామన అవతార రిలీజ్‌కు రెడీగా ఉంది.

చదవండి: స్టార్‌ హీరో ఇంట్లో అద్దెకు దిగిన యంగ్‌ హీరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement