
ప్రభాస్ పెళ్ళి దుస్తులు హైదరాబాద్‌లోనే కొంటామని చెబుతోంది ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి. తాజాగా ఆమె నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,యువ నటుడు రక్షిత్ అట్లూరితో కలిసి జూబ్లీహిల్స్‌లో జరివరం స్టోర్ ఓపెనింగ్‌కి అతిథిగా వెళ్లారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనకు కంచి పట్టు చీరలంటే చాలా ఇష్టమని..ఈ స్టోర్‌లో చాలా వెరైటీలు ఉన్నాయని తెలిపింది. ప్రభాస్ పెళ్లికి ఇక్కడ నుంచే దుస్తులు కొనుగోలు చేస్తామని చెప్పారు.
రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ : జరివరం స్టోర్ ఓపినింగ్ కు రావడం చాలా హ్యాపీ గా ఉంది..ఇక్కడ చీరల కలెక్షన్స్ చాలా యూనిక్ గా ఉన్నాయి... వైవిద్యం కోరుకొనే మహిళలకు ఈ జరివరం కలెక్షన్స్ తప్పకుండా నచ్చుతాయి అని తెలియజేశారు.
హైద్రాబాద్ లో ఉండే అతివలకు బెస్ట్ కలెక్షన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అభిలాష రెడ్డితో కలిసి నా భార్య గాయత్రి ఈ స్టోర్‌ని ప్రారంభించిందని నటుడు కృష్ణుడు అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, అభిలాష రెడ్డి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment