
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. నాగచైతన్యతో డేటింగ్ చేస్తుందంటూ ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో చైతో కలిసి ఉన్న ఫోటో బయటకు రావడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. సమంతకు విడాకులిచ్చిన తర్వాత చై.. శోభితకు దగ్గరయ్యాడంటూ వీరి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. దీనిపై అటు చైతూ కానీ, ఇటు శోభిత కానీ ఇంతవరకు స్పందించలేదు.
ఇకపోతే తాజాగా శోభిత ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్టులు షేర్ చేసింది. 'మెహందీ ఫంక్షన్.. ఎన్నో కొత్త ముఖాలు ఇప్పుడే తొలిసారిగా ఒకరిని ఒకరు చూసుకుంటున్నాయి. నేను మాత్రం ఇంకా రెడీ అవలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇంకా రెడీ అవకుండా నాకు తోడుగా ఉంది. నేను తారా ఖన్నా(మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్‌లో శోభిత నటించిన పాత్ర)లా మారిపోయి అరేంజ్‌మెంట్స్ అన్నీ చూస్తున్నా. అందుకే ముస్తాబవడానికి సమయం లేకుండా పోయింది. కానీ పెళ్లిమండపంలో సమంతను మొదటిసారి చూడగానే ఏడుపాగలేదు. ఇక్కడ మెహందీ పెట్టడం కుదరలేదు కానీ లంచ్ మాత్రం అద్భుతంగా ఉంది' అంటూ పెళ్లి మండపంలో ఉన్న ఫోటోలు షేర్ చేసింది.
మరో పోస్ట్‌లో 'సంగీత్ వేడుక.. నా సోదరికి డ్యాన్స్ మీదున్న పిచ్చి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంధువులు, సోదరులు, స్నేహితులు, వాళ్ల స్నేహితులు.. ఇలా అందరూ వచ్చేశారు. ఆటలు, పాటలు, మధ్యమధ్యలో ర్యాగింగ్.. సమయం చూస్తుండగానే ఉదయం నాలుగైంది. పార్టీ అయిపోయినా కూడా మా సందడి మాత్రం అలాగే కొనసాగింది. ఇది ఒక స్వచ్ఛమైన వేడుక, ఎన్నటికీ మర్చిపోలేనిది. సంగీత్ మేము, మా ఫ్రెండ్స్ అంతా వడచెన్నైలోని సంధానత పాటకు డ్యాన్స్ చేశాం' అని రాసుకొచ్చింది. దీనికి సంగీత్ ఫోటోలను జత చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఇది వెబ్‌సిరీస్ షూటింగా? లేదంటే నిజంగానే ఎవరి పెళ్లైనా జరిగిందా? అని కామెంట్లు చేస్తున్నారు. శోభిత ట్యాగ్ చేసిన సమంత అకౌంట్ వివరాలు చూస్తుంటే ఆమె డాక్టర్ అని తెలుస్తోంది. ఆమె పెళ్లి విశేషాలనే శోభిత షేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment