బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం సోలో బాయ్. నవీన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. నేడు(ఏప్రిల్ 14) గౌతమ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం గౌతమ్ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. ఈవెంట్లో హీరో గౌతమ్ కృష్ణ, హీరో ఫాదర్ మనోజ్ గారు, సెవెన్ హిల్స్ సతీష్ గారు, డైరెక్టర్ నవీన్ కుమార్ గారు, అనిత చౌదరి గారు, కమెడియన్ భద్రం, పింగ్ పాంగ్( సూర్య ) పాల్గొన్నారు.
హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ : నా పుట్టినరోజు పూట మూవీ టీం ఇలా ఈవెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ టీమ్ అందరూ కూడా సినిమా మీద ఇష్టంతో పని చేసినవారే. బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంటెంట్ ని తీసుకొస్తున్నాం. అతి త్వరలో టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మీ ముందుకు వస్తాం. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను ’ అన్నారు.
డైరెక్టర్ నవీన్ చెప్పిన కథ చాలా కొత్తగా అనిపించి, ఈ సినిమాను నిర్మించాను. ఈ చిత్రం కచ్చితంగా అందరికి నచ్చుతుంది’ అని ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ అన్నారు. చిన్న సినిమా పెద్ద సినిమాను ఉండదు మంచి సినిమా నే ఉంటుంది. సోలో బాయ్ కూడా ఒక మంచి సినిమా. మా హీరో గౌతమ్ కృష్ణ చాలా బాగా నటించాడు. సాంగ్స్ ఫైట్స్ ఎమోషనల్ సీన్స్ అన్నిటిలోనూ తనదైన శైలితో నటించాడు. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది’ అన్నారు దర్శకుడు పి.నవీన్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment