బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్‌’ | Bigg Boss 7 Fame Gautam Krishna Upcoming Solo Boy Movie Frist Look Poster Out, Goes Viral - Sakshi
Sakshi News home page

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్‌’

Published Wed, Feb 7 2024 4:54 PM | Last Updated on Wed, Feb 7 2024 5:48 PM

Bigg Boss fame Gautam Krishna Frist Look Out From Solo Boy Movie - Sakshi

‘బిగ్‌బాస్‌’ఫేమ్  గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సోలో బాయ్‌’. శ్వేతా అవాస్తి, రమ్య పసుపులేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. పి. నవీన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిసెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెవెన్ హిల్స్ సతీష్ నిరించారు. ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ గా ఆట సందీప్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ వేడుక ఈ నెల 7వ తేదీన జరిగింది.

ఈ కార్యక్రమంలో నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ గారు మాట్లాడుతూ - కోవిడ్ టైంలో నేను బట్టల రామస్వామి బయోపిక్ అనే సినిమా తీశాను. కోవిడ్ పాండమిక్ టైం లో ఓటిటి ద్వారా ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం. తర్వాత ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తున్న టైం లో ఈ కథ నచ్చి మీ ముందుకు తీసుకుని వచ్చాం. ఈ జెనరేషన్ ఆడియెన్స్ చూడాల్సిన సినిమా. వాళ్లకు ఈజీగా కనెక్ట్ అయ్యే అంశాలు ఉంటాయి. రెండు పాటలు మినహా పూర్తి చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాతో గౌతమ్ మళ్లీ మీ ముందుకు వస్తున్నాడు గతంలో ఆకాశవీధిలో సినిమాతో అలాగే బిగ్ బాస్ 7 లో ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. ఇప్పుడు సోలో బాయ్ సినిమాతో మళ్లీ మీ ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ తో వచ్చాం ఫ్యూచర్లో టీజర్, ట్రైలర్ తో మీ ముందుకు వస్తాం. సో ఈ సినిమాని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఈ సినిమా చూసి బయటకు వచ్చేప్పుడు కనీసం పది నిమిషాలు ఆలోచిస్తారు. అన్నారు.

హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ - గతంలో ఆకాశవీధిలో చేసినప్పుడు నటుడిగా మంచి గుర్తింపు వచ్చంది. తర్వాత వేరే కథలు వింటున్నప్పుడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. జనాలు నన్ను బాగా ఆదరించారు. ఈ రోజు మా సినిమా "సోలో బాయ్" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది. ముందు ముందు టీజర్ ట్రైలర్ ప్రమోషన్స్ తో కొత్తగా మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా సినిమా అనుకున్న దానికంటే బాగా రూపొందించాం. ఈ సినిమా చేస్తూ చేస్తూ మేమూ మూవీతో కనెక్ట్ అయ్యాం. తెలుగు ప్రేక్షకులకు మంచి టేస్ట్ ఉంది. మంచి సినిమాలను తప్పకుండా ఆదరిస్తారు. గతంలో ఆకాశవీధిలో, బిగ్ బాస్ తో ఎలా అయితే ఆదరించారో ఇప్పుడీ సినిమాతో కూడా అలాగే ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని సెవెన్ హిల్స్ సతీష్ గారు ప్రొడ్యూస్ చేయడం ఆనందంగా ఉంది అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement