SSMB28: Sunil Shetty Plays Villain Role In Mahesh Babu And Trivikram Upcoming Movie - Sakshi
Sakshi News home page

Mahesh Babu: మహేశ్‌ బాబు సినిమాలో విలన్‌గా స్టార్‌ హీరో!

Published Wed, Jan 19 2022 10:36 AM | Last Updated on Wed, Jan 19 2022 10:48 AM

Sunil Shetty Play Villain Role In Mahesh Babu And Trivikram Srinivas Upcoming Movie - Sakshi

మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కే కొత్త సినిమా కోసం టాలీవుడ్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తోంది. థర్డ్‌ వేవ్‌ కారణంగా ఈ మూవీ షూటింగ్‌ కొంత ఆలస్యమవుతోంది. అన్ని కుదిరితే మహేశ్‌తో సినిమాను ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాడట మాటల మాంత్రికుడు. ఈ మూవీకి పాన్‌ ఇండియా టచ్‌ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే మహర్షిలో మహేశ్‌తో జోడి కట్టిన పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇప్పుడు విలన్ రోల్ కోసం బాలీవుడ్ నుంచి బడా స్టార్ ను రంగంలోకి దింపుతున్నాడట. ఆయన ఎవరో కాదు సునీల్ శెట్టి. ప్రస్తుతం ఈ హిందీ నటుడు టాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. మోసగాళ్లు,గని లాంటి చిత్రాల్లో ఆల్రెడీ నటించేశాడు. ఇప్పుడు మహేష్ కు ప్రతినాయకుడిగా మారుతున్నాడట. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement