సాక్షి, విజయవాడ: పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల వివాదంలో చిక్కుకున్నారు. శ్రీలీల తన కూతురు అంటూ వస్తున్న వార్తలను ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు ఖండించారు. ఈ విషయంపై ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 'శ్రీలీల నా కూతరు కాదు. ఆమె నా మాజీ భార్య కూతురు. మేము విడిపోయిన తర్వాత నా మాజీ భార్య శ్రీలీలకు జన్మనిచ్చింది. నా ఆస్తులను క్లెయిమ్ చేయడానికి ఇంటర్వ్యూలలో నా పేరు వాడుతున్నారు.
ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్తాము. ఇంకా మా విడాకులపై కేసులు నడుస్తున్నాయి. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లాము. దీనిపై సూరపనేని సొసైటీకి కూడా ఫిర్యాదు చేసినట్లు' వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు తెలిపారు. అయితే తాజాగా విడుదలైన పెళ్లి సందD సినిమాలో శ్రీలీల సహస్ర పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. కానీ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
చదవండి: (పెళ్లి సందD సినిమా రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment