
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే. తల్లితో కలిసి సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. తల్లి కూతుళ్ల ఫోటోలు వైరల్ అయి, చివరకు ట్రోల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ మధ్య సురేఖ రెండో పెళ్లి చేసుకోబోతుందని పుకార్లు వినిపిస్తే.. వాటికి గట్టి కౌంటర్ ఇచ్చింది సుప్రిత.
తాజాగా ఆమె తన తల్లి రెండో పెళ్లి విషయంపై స్పందించింది. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుప్రీత మాట్లాడుతూ.. ‘రెండో పెళ్లి అనేది పూర్తిగా అమ్మ తీసుకునే నిర్ణయం. నాకైతే కచ్చితంగా అమ్మకి రెండో పెళ్లి చేయలనే ఉంది.అయితే ఏం జరుగుతుందన్నది టైం డిసైడ్ చేస్తుంది.ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాం. అమ్మకి తన కెరియర్ కంటే నా కెరియర్ మీదనే ఫోకస్ ఎక్కువగా పెట్టింది’అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది సుప్రిత.
అలాగే తన తండ్రి మరణించిన రోజు జరిగిన సంఘటనలను తలచుకుంటూ ఎమోషనల్ అయింది. ‘నాన్నకు తలకొరివి పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. అందుకే నేనే పెట్టేశా. నాన్న తరపు బంధువులు అయితే చివరి చూపు చూసేందుకు రాలేదు. నాన్న స్వంత సోదరుడు.. పాడె మోయకండి అని బంధువులకు చెప్పారు. ఆ సమయంలో అమ్మ తరపు బంధువులే అన్ని దగ్గర ఉండి అన్ని చూసుకున్నారు.ఇవన్ని ఎవరికి తెలియదు’అని సుప్రిత చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment