
రామ్‌చరణ్–తమన్నా జంట ఎలా ఉంటుందో ‘రచ్చ’ సినిమాలో చూశాం. మరి.. చిరంజీవి–తమన్నా జంట ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో చూసే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ టాక్. తనయుడి సరసన నటించిన తమన్నా ఇప్పుడు తండ్రి సరసన నటించనున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘బోళా శంకర్’ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే.చదవండి : Tamannaah: 'అనారోగ్యం.. అందుకే ప్రతిరోజు ఆ జ్యూస్ తాగుతా'
ఇందులో చిరంజీవి పాత్రకు ఓ చెల్లెలు ఉంటుంది. ఆ క్యారెక్టర్‌ను కీర్తీ సురేష్ చేయనున్నారు. కథానాయికగా తమన్నాని ఎంపిక చేశారని సమాచారం. అదే నిజం అయితే ‘సైరా’ తర్వాత మరోసారి చిరంజీవితో ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. తమిళ చిత్రం ‘వేదాళం’కి రీమేక్‌గా రూపొందనున్న ‘బోళా శంకర్’ షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. చదవండి : కాజల్ గర్భవతా? సినిమా నుంచి తప్పుకున్న చందమామ!
Comments
Please login to add a commentAdd a comment